నీ జర్నీలో నేను ఉన్నందుకు సంతోషంగా ఉంది.. సమంత కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Samantha Ruth Prabhu Special Wishes To Allu Arjun Details, Samantha, Allu Arjun-TeluguStop.com

సమంత విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తూ నిత్యం ఏదో రకమైన పోస్ట్ లు పెడుతూనే ఉంది.తరచూ ఏదో రకమైన కొటేషన్ లను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది సమంత.

ఇది ఇలా ఉంటే నిన్న అనగా ఏప్రిల్ 8న టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే అన్న విషయం అందరికి తెలిసిందే.అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా సమంత బన్నీ పై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు చేసింది.

సమంత చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇటీవలే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక ఇందులో సమంత స్పెషల్ సాంగ్ కు చిందులు వేసిన విషయం తెలిసిందే.ఈ పాట ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవడమే కాకుండా ఈ సినిమా విడుదలైన తర్వాత కొద్దిరోజుల పాటు ఎక్కడ చూసినా కూడా మారుమోగిపోయింది.

అల్లు అర్జున్, సమంత కాంబినేషన్ కు మంచి మార్కులే పడ్డాయి.అదేవిధంగా వీరిద్దరూ కలసి సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన విషయం తెలిసిందే.పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ టాలీవుడ్ బాలీవుడ్ లోని పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.అంతే కాకుండా ఆ పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ తరువాత సమంత మరింత పాపులారిటీని సంపాదించుకుంది.

Telugu Allu Arjun, Pushpa, Samantha, Samantha Wishes-Movie

అలా పుష్ప సినిమా ద్వారా సమంత, అల్లుఅర్జున్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయిన విషయం తేలిసిందే.పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా ఊహించని విధంగా వసూళ్లు రాబట్టింది.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా సమంత అల్లు అర్జున్ జర్నీ లో ఒక చిన్న పార్ట్ అని ఎంతో గొప్పగా చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Telugu Allu Arjun, Pushpa, Samantha, Samantha Wishes-Movie

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా సమంతా సోషల్ మీడియాలో విషెస్ చెబుతూ.హ్యాపీ బర్త్ డే.నువ్వు టెర్రిఫిక్ పర్సన్ వి.నీ ఈ అద్భుతమైన జర్నీ లో నేను కూడా ఒక చిన్న పార్ట్ అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.నువ్ నన్ను ఎంతో ఇన్ స్పైర్ చేశావ్.నువ్ చెప్పిన మాటలన్నీ నాకు ఎప్పటికీ గుర్తుంటాయ్.నీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అంటూ బన్నీపై సమంత ప్రేమను కురిపించింది.ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube