తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం సమంత వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
మొన్నటి వరకు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడిపిన సమంత ఇటీవల సినిమాలకు ఏడాది పాటు గ్యాప్ ఇచ్చినట్లు తెలిపి ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది.ప్రస్తుతం వెకేషన్ లో భాగంగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది సమంత.
కాగా సమంత విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో( Khusi Movie ) నటించిన విషయం తెలిసిందే.శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ మూవీ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించారని తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే సమంత ఇటీవల తాను మయోసైటిస్( Myositis ) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.ఇక అందులో భాగంగానే తనకు ఆరోగ్యం బాగో లేకపోవడంతో ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం వెకేషన్ లో( Vacation ) ఉన్న సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూనే ఉంది.ఇటీవల కాలంలో వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ వార్తలు నిలుస్తోంది సమంత.
ఈ నేపథ్యంలోనే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో( Instagram ) ఒక పోస్ట్ చేసింది.ఆ పోస్టులో ఈ విధంగా రాసుకొచ్చింది.బొద్దింకను చంపితే హీరో అంటారు.అదే సీతాకోకచిలుకను చంపితే విలన్ అంటారు.ఇక్కడ అందాన్ని బట్టి నైతికత ఆధారపడి ఉంటుంది అని రాసుకొచ్చింది.ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే సమంత ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టింది అన్నది అర్థం కాక నెటిజన్స్ తెగ ఆలోచిస్తూ కామెంట్లు పెడుతున్నారు.