సామజవరగమనా.. కొత్తగా పాడింది ఎవరో తెలుసా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్‌టైనర్ అల వైకుంఠపురములో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండగా థమన్ చక్కటి బాణీలు అందించాడు.

 Samajavaragamana By Shreya Ghoshal-TeluguStop.com

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలోని పాటలకు అన్ని వర్గాల శ్రోతల నుండి భారీ ఆదరణ లభిస్తోంది.

ముఖ్యంగా ఈ సినిమాలోని సామజవరగమన అనే సాంగ్ యూట్యూబ్ రికార్డులను షేక్ చేసింది.

సిడ్ శ్రీరామ్ పాడిన ఈ చక్కటి పాటకు ప్రపంచవ్యాప్తంగా శ్రోతలు బాగుందని మెచ్చుకున్నారు.ఇలాంటి రికార్డు క్రియేట్ చేసిన పాటను థమన్ మరోసారి కొత్తగా ప్రయోగం చేసి వదిలాడు.

ఈసారి ఫీమేల్ వర్షన్‌తో ఈ పాటను రిలీజ్ చేశాడు.

ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్ ఈ పాటను ఆలపించింది.

ఈ పాటకు సంబంధించిన వీడియోను తాజాగా థమన్ రిలీజ్ చేశాడు.ఇప్పుడు ఇది యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా దూసుకుపోతుంది.

ఏదేమైనా ఒకే పాటను రెండు వాయిస్‌లతో పాడించి మెప్పించిన థమన్‌ను ప్రేక్షకులతో పాటు చిత్ర యూనిట్ శభాష్ అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube