సౌదీ అరేబియా వెళ్లానుకుంటున్న భారతీయ పర్యాటకులకు ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.వీసా నిబంధనలను సులభతరం చేస్తున్నట్లు ప్రకటించింది.
దీని ప్రకారం చెల్లుబాటయ్యే యూఎస్, యూకే లేదా స్కెంజెన్ వీసా ద్వారా పర్యాటకం కోసం సౌదీ విమానాల ద్వారా ప్రయాణించినట్లయితే వారికి వీసా ఆన్ అరైవల్ ఇస్తామని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.
గతేడాది సెప్టెంబర్లో సౌదీ అరేబియా మొదటిసారిగా పర్యాటక వీసాలను అందిస్తున్నట్లుగా ప్రకటించింది.
తమ ఆర్ధిక వ్యవస్థ చమురుపై ఆధారపడినది మాత్రమే కాదని.దేశాన్ని అల్ట్రా-కన్జర్వేటివ్ ఎకానమీగా మార్చేందుకు సౌదీ ప్రయత్నిస్తోంది.
ఇందుకు గాను సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030 కింద సంస్కరణలు చేపట్టారు.
దీనిలో భాగంగా కిక్ స్టార్టింగ్ టూరిజానికి ఆయన పెద్ద పీట వేశారు.ఈ సందర్భంగా ఆ దేశ పర్యాటక శాఖ చీఫ్ అహ్మద్ అల్-ఖతీబ్ మాట్లాడుతూ.సౌదీలోని యొనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, శక్తివంతమైన స్థానిక సంస్కృతి, సహజ సిద్ధ ప్రకృతి సౌందర్యానికి సందర్శకులు ఆశ్చర్యపోతారని ఆయన పేర్కొన్నారు.
త ద్వారా దేశంలో పర్యాటకానికి ద్వారాలు తెరవడం సౌదీకి చారిత్రాత్మక అవసరమన్నారు.