టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్, ప్రశాంత్ నీల్( Prabhas, Prashant Neil ) కాంబినేషన్ లో రూపొందిన సినిమా సలార్.కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఎంతో ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు పోస్టర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.దానికి తోడు కేజీఎఫ్ సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంతి నీల్ తెరకెక్కించిన మూవీ కావడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.

హోంబలే ఫిల్మ్స్( Hombale Films ) వారు బడ్జెట్‌కు ఏ మాత్రం తగ్గకుండా సలార్‌ను తెరకెక్కిస్తున్నారు.ఇలా సలార్ ( Salar )చుట్టూ అదిరిపోయే కాంబినేషన్ ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.కాగా ఈ సినిమా రెండు పార్ట్ లుగా తెరకెక్కునున్న విషయం మనందరికీ తెలిసిందే.సలార్ పార్ట్ 1లో కొన్ని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం జీపులు, ట్యాంకులు, ట్రక్కులతో సహా మొత్తం 750కి పైగా వాహనాలను ఉపయోగించారట.సలార్ యాక్షన్ సన్నివేశాల గురించి చిత్ర నిర్మాణ బృందం కొంత సమాచారాన్ని తాజాగా పంచుకుంది.

సలార్ షూటింగ్ కోసం 750కి పైగా వివిధ రకాల వాహనాలను ఉపయోగించినట్లు కన్నడ మీడియాతో చిత్ర యూనిట్ పంచుకుంది. జీపులు, ట్రక్కులు సహా అనేక వాహనాలను షూటింగ్‌కు వినియోగించారు.హాలీవుడ్ సినిమాలో లాగా భారీ యాక్షన్ సన్నివేశాలను సలార్ కోసం చిత్రీకరించారు.సినిమా కోసం భారీ యుద్ధ భూమినే నిర్మించారు.అలాగే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త కూడా చక్కర్లు కొడుతోంది.కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌ను కూడా ఆరు నెలల్లో విడుదల చేయాలని భావిస్తున్నారట.పార్ట్-2 ఏప్రిల్ 2024లో వేసవి సెలవుల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమచారం.కానీ సలార్ పార్ట్ 1 విడుదలైన తర్వాత వెంటనే పార్ట్ 2 విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని టాక్.సలార్ పార్ట్-1 ఎండ్ కార్డ్‌లోనే పార్ట్-2 ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ప్రకటించే ఛాన్స్ ఉందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.పార్ట్-2 కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.సలార్ పార్ట్-1 డిసెంబర్ 22న విడుదల కానుంది.