ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న విరూపాక్ష మూవీ.. సాయితేజ్ ఈజ్ బ్యాక్ అనేలా?

సాయితేజ్, సంయుక్త మీనన్( Saitej, Sanyukta Menon ) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన విరూపాక్ష మూవీ( Virupaksha movie ) నేడు థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో పాటు తొలిరోజు ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధించే ఛాన్స్ అయితే ఉంది.

 Sai Tej Virupaksha Movie Ott Streaming Date Details Here Goes Viral , Sai Tej ,-TeluguStop.com

సంయుక్త మీనన్ కు వరుస విజయాలు దక్కుతుండటంతో ఆమెకు గోల్డెన్ లెగ్ ఇమేజ్( Golden Leg Image ) కంటిన్యూ అవుతోంది.సంయుక్త ఖాతాలో మరిన్ని విజయాలు చేరాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరోవైపు ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ను సైతం లాక్ చేసుకుంది.నెట్ ఫ్లిక్స్( Netflix ) లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది.

సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కార్తీక్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.ఊహలకు భిన్నంగా కథ, కథనం ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది.

ఎన్ని వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో వస్తుందనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది.

ఈ మధ్య కాలంలో నెట్ ఫ్లిక్స్ క్రేజీ సినిమాల డిజిటల్ హక్కులను కొనుగోలు చేస్తుండటం గమనార్హం.ప్రస్తుతం తెలుగులో విడుదలైన ఈ సినిమా త్వరలో ఇతర రాష్ట్రాల్లో సైతం విడుదల కానుందని తెలుస్తోంది.ఇతర రాష్ట్రాల్లో సైతం విరూపాక్ష సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి.

బీజీఎం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.సాయితేజ్ సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

ఈ వీకెండ్ కు థియేటర్లలో సినిమా చూడాలని భావించే వాళ్లకు ఈ మూవీ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు.విరూపాక్ష మూవీ కమర్షియల్ గా ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.సాయితేజ్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.విరూపాక్ష మూవీలో సాయితేజ్ నటనను చూసి సాయితేజ్ ఈజ్ బ్యాక్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube