బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన వీరసింహారెడ్డి మూవీ ట్రైలర్ తాజాగా యూట్యూబ్ లో విడుదలై రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించి వార్తల్లో నిలిచింది.ఈ ట్రైలర్ కు ఇప్పటివరకు ఏకంగా 11 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
నిన్న సాయంత్రం వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్ కాగా ఈ ట్రైలర్ కు కూడా రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.ప్రస్తుతం వీరసింహారెడ్డి ట్రైలర్ నంబర్ 1గా ట్రెండింగ్ లో నిలవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
అయితే ట్రైలర్ లో జగన్ కు వ్యతిరేకంగా డైలాగ్స్ ఉండటం వల్ల వైసీపీ నేతలు టార్గెట్ చేసి మరీ బాలయ్యపై కామెంట్లు చేయడం ఫ్యాన్స్ కు నచ్చడం లేదు.బాలయ్య, జగన్ కామన్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో తెగ ఫీలవుతున్నారు.
వాస్తవానికి మైత్రీ నిర్మాతలకు వైసీపీకి మధ్య ఎలాంటి సమస్యలు లేవు.పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు గోపీచంద్ మలినేని సన్నిహితుడు అనే సంగతి తెలిసిందే.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా గోపీచంద్ మలినేని పలువురు వైసీపీ నేతలకు థ్యాంక్స్ చెప్పారు.
బాలయ్య సైతం తన సినిమాలలో ఏపీ అధికార పార్టీకి వ్యతిరేకంగా డైలాగ్స్ ఉండాలని కోరుకోరు.అయితే సాయిమాధవ్ బుర్రా మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా సినిమాలో డైలాగ్స్ ఉండేలా చూసుకున్నారు.ఈ విధంగా చేయడం వల్ల బాలయ్యపై వైసీపీ నేతలు వేర్వేరు ఘటనలను ప్రస్తావిస్తూ విమర్శిస్తున్నారు.
చెయ్యని తప్పుకు బాలయ్య శిక్ష అనుభవిస్తున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు.
గతంలో కూడా బాలయ్య సినిమాలలో పొలిటికల్ డైలాగ్స్ ఉన్నా ఈ స్థాయిలో కౌంటర్స్ ఎప్పుడూ రాలేదు.బాలయ్యను మెప్పించాలనే ఆలోచనతో సాయిమాధవ్ బుర్రా ఈ డైలాగ్స్ ను రాసి ఉండొచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఏదేమైనా ఈ తరహా ఘటనల వల్ల నష్టపోయింది మాత్రం బాలయ్యేనని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.