800 కోట్లతో ప్యాలెస్ ని దక్కించుకున్న సైఫ్ అలీ ఖాన్..!

బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన సైఫ్అలీఖాన్ సినిమాల్లో తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు.ఇక సైఫ్ అలీ ఖాన్ కుటుంబ విషయానికి వస్తే.

 Saif Ali Khan Owns The Palace For Rs 800 Crore Saif Ali Khan, Patodi Palace, Bo-TeluguStop.com

వారిది రాయల్ ఫ్యామిలీ. ఆయన తండ్రి పేరు మహమ్మద్ మన్సూర్ అలీ ఖాన్ సిద్ధికి పటౌడీ .ఈయన పేరు మోసిన భారతీయ క్రికెటర్.అంతేకాదు ఆయన ఒక నవాబ్.

ఇక వీరి ఫ్యామిలీకి సంబంధించి ప్యాలెస్ కూడా ఉంది.హర్యానా రాష్ట్రంలో ఉన్న ఆ ప్యాలెస్ ను పటౌడీ ప్యాలెస్ అని పిలుస్తారు.

ఈ ప్యాలెస్ 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది.ఈ ప్యాలెస్ల లో మొత్తం 150 గదులు ఉండగా.

వాటిలో 7 డ్రెస్సింగ్ రూమ్, 7 బెడ్ రూమ్స్, 7 బిలియర్డ్స్ రూమ్స్ తో పాటు ఎంతో పెద్ద స్విమ్మింగ్ పూల్ అలాగే ఆట స్థలాలు ఉన్నాయి.ఈ ప్యాలెస్ ఎప్పుడూ ఓ రాజ భవంతిలా మెరుస్తూనే ఉంటుంది.

అయితే సైఫ్ అలీ ఖాన్ తండ్రి మన్సూర్ పటౌడీ మరణించిన తర్వాత కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ ప్యాలెస్ ను హోటల్ కు లీజుకు ఇవ్వడం జరిగింది.అలా కొన్ని రోజుల వరకు ఆ ప్యాలెస్ లో హోటల్ రన్ అయ్యింది.

ఇకపోతే తాజాగా ఈ హోటల్ కు సంబంధించి ఓ పార్ట్నర్ మృతి చెందడంతో సైఫ్ అలీ ఖాన్ ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని ఉద్దేశంతో అందుకోసం ఆ హోటల్లో చేసుకున్న కాంట్రాక్టును రద్దు చేసుకున్నారు.దీంతో ఆ ప్యాలెస్ ను సొంతం చేసుకోవడానికి అప్పటివరకు తాను బయట బిజినెస్ లో అలాగే సినిమాల్లో సంపాదించిన మొత్తం డబ్బులు చెల్లించి దక్కించుకున్నట్లు తెలిపారు సైఫ్ అలీ ఖాన్.

ఈ పటౌడీ ప్యాలెస్ ను దక్కించుకోవడానికి దాదాపు 800 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు చెప్పుకొచ్చాడు.ఇకపోతే ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనాకపూర్ అలాగే కొడుకు అలీ ఖాన్ తో కలిసి హర్యానా లోని వారి పూర్వీకుల ఇంట్లో నివసిస్తున్నాడు.

వారి వంశం పరంగా వచ్చిన ప్యాలెస్ ను తిరిగి సొంతం చేసుకునేందుకు తనకు ఎంతగానో సంతోషంగా ఉన్నట్లు సైఫ్ అలీఖాన్ తెలియజేశాడు.

ఈ ప్యాలెస్ ను దక్కించుకున్న తర్వాత సైఫ్ మాట్లాడుతూ.” వారసత్వంగా నేను పొందాల్సిన ఇంటిని కూడా తాను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో తిరిగి పొందానని చెప్పుకొచ్చాడు.గతం లేకుండా మనం జీవించలేమని, అందులో చరిత్ర, సంస్కృతి, అందమైన ఫొటోగ్రాఫ్ ‌లు, కొంత స్థలం ఉంటాయని చెప్పుకొచ్చాడు.

ఇదో తనకి ఓ ప్రత్యేకమైన సంపద.అయితే అందులో వారసత్వం లేదని… ఈ ప్యాలెస్ ఓ గొప్ప చరిత్ర అని అందుకే దీన్ని వదులుకోలేనని కష్టపడి తిరిగి నా చేతికి తెచ్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు సైఫ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube