ఎలాన్ మస్క్ స్థాపించిన బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్( Neuralink ) పక్షవాతం, అంధత్వం, ఇతర నాడీ సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్న వ్యక్తుల కోసం బ్రెయిన్ చిప్( Brain Chip ) అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిప్ నాడీ సంకేతాలను రికార్డ్ చేసి, ప్రసారం కూడా చేయగలదని అంటున్నారు.
ఈ చిప్ మెదడులో అమర్చుకున్న వ్యక్తులు వారి ఆలోచనలతోనే స్మార్ట్ ఎలక్ట్రానిక్ డివైజ్‌లను కంట్రోల్ చేయగలరని కూడా అంటున్నారు.ఈ వినూత్న ఆలోచన చాలామందిని ఆకట్టుకుంది.
అయితే ఇలాంటి బ్రెయిన్ చిప్‌ని అందరికంటే ముందే తానే మెదడులో అమర్చుకోవాలని ఒక వ్యక్తి ప్రయత్నించాడు.కానీ ఆ ప్రయత్నం బ్యాక్ ఫైర్ అయింది.
అంతేకాదు, ఏకంగా అతడే ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది.
వివరాల్లోకి వెళితే, రష్యాకు( Russia ) చెందిన మిఖాయిల్ రాదుగా అనే 40 ఏళ్ల వ్యక్తి మెదడులో మైక్రోచిప్ పెట్టుకుని తన కలలను కంట్రోల్స్ చేసుకోవాలనుకున్నాడు.డ్రిల్‌తో తనకు తానుగా బ్రెయిన్ సర్జరీ( Brain Surgery ) చేసేందుకు ప్రయత్నించాడు.అతను వైద్య నిపుణుల సహాయం కోరాలని మొదటగా అనుకున్నాడు, కానీ కొన్ని సమస్యల కారణంగా అతను అలా చేయకూడదని నిర్ణయించుకున్నాడు.
చివరికి తానే స్వయంగా ఈ సర్జరీ చేసుకున్నాడు.
ట్విట్టర్‌లో ప్రయోగానికి సంబంధించిన ఫోటోలను కూడా పంచుకున్నాడు.తన కలల సమయంలో తాను ఒక ప్రత్యేక ప్రయోగం చేశానని చెప్పాడు.కానీ చాలా రక్తాన్ని కోల్పోయానని, దాదాపు చావుల అంచుల వరకు వెళ్లొచ్చానని పేర్కొన్నాడు.
ఇప్పటికీ పరిస్థితి ఏం బాగోలేదని అన్నాడు.చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందని తెలిపాడు.
ఈ ప్రమాదకరమైన పనిని ప్రయత్నించవద్దని అతను ఇతరులను హెచ్చరించాడు.ఎందుకంటే ఇది కనిపించే దానికంటే చాలా కష్టం.