ఒక అగ్ర దేశం చిన్న దేశంతో ఇంత కాలం యుద్ధం చేయడం అందరిని నివ్వెర పరుస్తోంది.దాదాపు తొమ్మిది నెలల నుంచి సాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం లో గెలుపెవరిదో, ఎవరి చెప్పుచేతుల్లో ఎవరు ఉండాలి అని తెలియని సందిగ్ధం లో ఇరు దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయియి.
ఇరు దేశాలు పట్టు వీడటం లేదు.రాజ్యాల సయోధ్య ఫలించటం లేదు.
రాజ్యాలు కూడా కేవలం సానుభూతి చూపిస్తున్నాయే కాని సరైన ప్రణాళికతో వ్యవహరించ లేదనిపిస్తోంది.సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి చెప్పినా ఫలితం లేకుండా పోయింది.
నేటి ఆధునిక యుగంలో యుద్ధం ఇంత దీర్ఘకాలం జరగడం ఇదే ప్రధమం అదీ ఓ చిన్న దేశంతో.ఇక్కడ ఎవరి బలాలు ఎంత అని బేరీజు వేసుకుంటే రష్యాకే ఎక్కువ బలం ఉందని స్పష్టమవుతోంది.
అయితే ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటోంది.
అదే ఇప్పటికీ రష్యాకు అంతు పెట్టకుండా ఉంది.
పశ్చిమ దేశాలు ఎన్ని ఆయుధాలు ఇచ్చినా ఉక్రెయిన్ పోరాట పటిమ కొనియడ దగ్గది.ఇవన్నీ బాగానే ఉన్నాయి కాని ఇరువైపులా పౌరుల ,సైనికుల ప్రాణ నష్టం ఎంతో బాధకు గురిచేస్తుంది.
సైనికులు అంటే దేశ రక్షణ కొరకు ప్రాణాలు సైతం ఇచ్చేవారు.అయినా అనవసరంగా కాలు దువ్వి సైనికుల మరణాలకు ఇరు దేశాలు కారణం అవుతున్నాయి.
పాపం రష్యా ,ఉక్రెయిన్ లో కేవలం సైనికుల మరణం చాలా బాధ కలిగిస్తుంది.దాదాపు పదమూడు వేల మందికి పైగా సైనికులం పోగొట్టుకున్నాం అని ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది.
ఈ విషయంలో మాకు ఎటువంటి దాపరికాలు లేవని మా సైనికుల మృతులు వాస్తవంగా పదమూడు వేల మంది ఉన్నారని ఇది ఖచ్చితమైన, పారదర్శకత తో చెబుతున్నదని ఉక్రెయిన్ చెప్పడం గమనార్హం.

అయితే అమెరికా ఈ విషయంలో రష్యానే ఎక్కువ సంఖ్యలో అంటే లక్ష దాక సైనికులను కోల్పోయి ఉండవచ్చని ఇది కచ్చితమైన ఆధారమని అమెరికా ఆర్మీ అధికారులు వెల్లడించారు.అయితే యూరోపియన్ అధిపతి ఉర్సులా వొన్డెర్ లెయన్ వాదన మరో రకంగా ఉంది.ఆయన లక్ష వరకు ఉక్రెయిన్ సైనికులు మరణించి ఉండవచ్చని చెప్పారు.
అయితే ఇది ఇరువైపులా ఉండవచ్చని చెప్పారు.ఇదిలా ఉండగా బ్రిటన్ కు చెందిన ప్రముఖ టి.వి ప్రెజంటర్ బేర్ గ్రిల్స్ ఉక్రెయిన్ లో పర్యటించారు.ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడుతో భేటి అయ్యారు.
ఉక్రెయిన్ లో చాలా తీవ్రమైన చలి ఉంది.ప్రజలు చలికి వణికి పోతున్నారు.
చాలా చోట్ల మంచు పడటం జరుగుతోంది.ఇదంతా ఒక ఎత్తైతే రష్యా ,ఉక్రెయిన్ పౌరుల మౌలిక వసతుల పై దాడులు జరపడం ప్రజలు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు.
ఉక్రెయిన్ కు ప్రతి రోజు గండమే,ప్రతి రోజు వారికి పోరాటమే అయినా ఉక్రెయిన్ ఏ మాత్రం బెదరడం లేదు.ప్రస్తుతం ప్రపంచం ఇప్పటి వరకు చూడని ఓ కొత్త జెలెన్ స్కీ ని చూస్తోంది అని గ్రిల్స్ పేర్కొన్నారు.
గ్రిల్స్ మాట అటుంచితే రెండు దేశాలు శాంతి కోసం ప్రయత్నాలు జరిపితే బాగుండు.ఇప్పటికే యుద్ధం యొక్క భయానక వాతావరణం ఇరు దేశాల పౌరులు చూస్తున్నారు.

ముఖ్యంగా ఉక్రెయిన్ లో పౌరులు, పసిబిడ్డలు ,గర్భవతులు మొదలైన వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? కనీసం వీరినైన ఈ దేశాలు చూడవా! కరుణించవా! పౌరుల సంక్షేమ మే లక్ష్యం అనేవి ఉట్టి మాటలేనా! పోరులు ఎదుర్కొనే కడగండ్లు వారికి పట్టవా! వారి కళ్ళల్లో దైన్యం చూడరా! వారి కోసమైనా మీరు యుద్ధం విరమించలేరా! మీ పట్టుదల పోకడలు ఎంత కాలం? ఎన్నాళ్ళు ఈ నరమేధం? శాంతి కోసం ఎందుకు ప్రయత్నాలు చేయారు.తాము అది కూలదోశాము, మా దాడిలో అవి ధ్వంసం అయినాయి అని గొప్పలు చెప్పుకుంటున్నా మిగతా దేశాలు ఎందుకు గట్టిగా పెదవి విప్పడం లేదు? శాంతి కోసం దేశాలు ఏకమై ఎందుకు ప్రయత్నాలు చేయవు? ఇదేనా అంతర్జాతీయ సహాయ సహకారం,దేశ భద్రత, పౌరుల సంక్షేమం వీరికి పట్టదా అని సామాన్య పౌరులు నేడు రెండు దేశాలను ప్రశ్నిస్తున్నారు.దేశాలు ఎందుకు బలమైన నిర్ణయాలు తీసుకోవడం లేదు.ప్రతి దేశం శాంతి కోసమే కదా ఉండేది అని పలువురిని వేధిస్తున్న ప్రశ్న.ఒక దేశ పౌరుడిగా, ప్రజల సంక్షేమం , దేశాల ప్రగతి, సుస్థిర అభివృద్ధి సాధించాలంటే ఈ వ్యాస కర్త మాట ఒక్కటే రెండు దేశాలు పట్టు వీడాలి.పౌరులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి.
ఏ దేశం పై చేయి సాధించామని విర్ర వీగ రాదు.పౌరుల కోరకు ఈ యుద్ధం విరమిస్తున్నాం అని రష్యా,ఉక్రెయిన్ లు ప్రకటించాలి.
ఈ ప్రకటన తో ప్రపంచం సంతోషిస్తుంది.కీవ్, మాస్కో ప్రజలు కూడా హర్షిస్తారు.