పది రోజుల క్రితం స్టార్ మా ఛానల్ లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రసారమైన సంగతి తెలిసిందే.రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కావడం, చరణ్ తారక్ ఒకే సినిమాలో నటించడం, ఇతర ఛానెళ్లతో పోల్చి చూస్తే స్టార్ మా ఛానెల్ రీచ్ కూడా ఎక్కువ కావడంతో ఆర్ఆర్ఆర్ బుల్లితెరపై రికార్డ్ స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుందని అందరూ భావించారు.
అయితే మరీ భారీ స్థాయిలో కాకపోయినా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఈ సినిమాకు రేటింగ్స్ వచ్చాయి.
ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్ 19.6 రేటింగ్ ను సొంతం చేసుకోగా ఆర్ఆర్ఆర్ మలయాళ వెర్షన్ 13.47 రేటింగ్ ను సాధించడం గమనార్హం.మరీ ఆలస్యంగా బుల్లితెరపై ప్రసారం కావడం వల్లే కొంతమేర ఆర్ఆర్ఆర్ రేటింగ్ తగ్గిందని చెప్పవచ్చు.జీ5, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్ అందుబాటులో ఉండటంతో ఈ సినిమా అభిమానులు ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ను ఓటీటీలో చూసేశారు.
ఆర్ఆర్ఆర్ మూవీ మంచి రేటింగ్ ను సొంతం చేసుకోవడంతో భారీ మొత్తం చెల్లించి హక్కులు కొనుగోలు చేసిన స్టార్ మా ఛానల్ కు కూడా మంచి లాభాలు రావడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం గమనార్హం.
ఆర్ఆర్ఆర్ మంచి రేటింగ్ సాధించడంతో ఫ్యాన్స్ సైతం ఒకింత సంతోషిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై నాలుగు నెలలైనా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో, ప్రేక్షకుల మధ్య చర్చ జరుగుతోంది.ఆర్ఆర్ఆర్ బుల్లితెరపై రాబోయే రోజుల్లో ప్రసారమైన సమయంలో కూడా రికార్డ్ స్థాయిలో రేటింగ్ ను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని నెటిజన్లు భావిస్తున్నారు.రాజమౌళి రేంజ్ ను మరింత పెంచిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచిందనే సంగతి తెలిసిందే.