మమానవ తప్పిదాల వల్లే దాదాపు 91శాతం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, చిన్నపాటి నియంత్రణతో ఇలాంటి ప్రమాదాల నుండి తప్పించుకునే అవకాశం ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.రోడ్డు భద్రతా ప్రమాణాలు, ప్రమాదాల నివారణ చర్యలపై సమీక్షా పోలీస్, రవాణా, R&B, మున్సిపల్, NHAI ఉన్నతాధిరులతో కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు భద్రత ప్రమాణాలపై పలు సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం తో జాతీయ రహదారుల ప్రమాదాల తీవ్రత గత సంవత్సరంతో పోల్చితే గణనీయంగా తగ్గాయి అని వివరించారు.
జిల్లా వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాలపై విశ్లేషించి రోడ్డు ప్రమాదాల సంఖ్య మరింత గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, రవాణా శాఖ, రెవెన్యూ, NHAI, ఆర్‌అండ్‌బీ అధికారులు క్షేత్రస్ధాయిలో కృషి చేయాలని అన్నారు.
భవిష్యత్తులో నగరం నాలువైపుల నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం జరుగుతుందని తద్వారా ప్రమాదాల వల్ల ఏలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు ప్రణాళికతో రోడ్డు భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రధానంగా వేగ నియంత్రికలు, సూచిక బోర్డుల ఏర్పాటు , జాతీయ, రాష్ట్ర, ఇతర ప్రధాన రహదారులకు వివిధ గ్రామాలు, ప్రాంతాల నుంచి అనుసంధానం చేసే రోడ్లపై అవసరమైన చోట్ల వేగ నియంత్రికలు నిర్మించాలని, ఫలితంగా వాహన చోదకుడు వేగాన్ని తగ్గించి, చుట్టుపక్కల వాహనాలను గమనించి ముందుకు వెళ్లే ఆవకాశం వుంటుందని అన్నారు.
అదే సమయంలో ప్రధాన రహదారులపై హెచ్చరిక బోర్డులు (సైన్ బోర్డులు), దారి మలుపులను తెలిపే సూచిక బోర్డులు, ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్స్‌ను ఏర్పాటు చేయాలి.జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ గారి అధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎంపి వద్దిరాజు రవిచంద్ర , జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ , డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం , ACP లు, CI లు, సిబ్బంది తదితరులు ఉన్నారు.