ప్రపంచ కుబేరుడి డబ్బు రూ. 90 వేల కోట్లు ఒకే రోజులో హరీ!

ప్రపంచ సంపన్నుల జాబితాలో( World Richest Man ) టాప్ ప్లేసులో ఎవరున్నారు అనగానే మొదటగా మెదిలే పేరు బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌.( Bernard Arnault ) కాగా ఆయన సంపదలో రూ.90 వేల కోట్లు( 11 బిలియన్ డాలర్లు) ఒకే ఒక్కరోజులో నష్టపోయినట్టు సమాచారం.ఇక దానికి కారణం.

 Richest Person In The World Bernard Arnault Loses 11 Billion Dollars In One Day-TeluguStop.com

అమెరికా ఆర్థిక సంక్షోభం అని చెప్పుకోవచ్చు.ఎందుకంటే గత కొంతకాలంగా అమెరికా( America ) అర్ధక వ్యవస్థపైన అనేక అనుమానాలు వస్తున్నాయి.

దాని వల్ల లగ్జరీ వస్తువులకు డిమాండ్‌ తగ్గుతందనే ఆందోళనలు ఏర్పడ్డాయి.ఈ నేపథ్యంలోనే ఆయన కంపెనీల షేర్లు భారీగా పతనం కావడంతో ఆయన సంపదలో తీవ్ర ఒడిదొడుకులు మొదలయ్యాయి.

ఇకపోతే, ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ కంపెనీ ఎల్‌వీఎంహెచ్‌ కంపెనీ లగ్జరీ ప్రొడక్టులను తయారు చేస్తుందనే విషయం విదితమే.ఈ కంపెనీ వివిధ బ్రాండ్లతో కాస్ట్ లీ హ్యాండ్‌బ్యాగ్స్, షాంపులు, ఖరీదైన గౌన్లతో సహా మరెన్నో వస్తువులను తయారు చేస్తుంది.ఈ యూరప్‌ లగ్జరీ బ్రాండ్లకు అమెరికాతో పాటు ఆసియా దేశాల్లో అతిపెద్ద మార్కెట్‌ ఉందనే విషయం కూడా తెలిసిందే.ఎల్‌వీఎంహెచ్‌ 2022 నివేదిక ప్రకారం.ఆ సంస్థ ఉత్పత్తుల అమ్మకాల్లో 27 శాతం అమెరికా వాటా కాగా ఆసియా వాటా 30 శాతంగా ఉంది.

ఈ క్రమంలో, ఇటీవల అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్న సంగతి నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ఆ ప్రభావం లగ్జరీ బ్రాండ్‌లపై పడింది.దీంతో సదరు కంపెనీల విలువ 30 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి.వీటిలో ఆర్నాల్ట్‌కు చెందిన ఎల్‌వీఎంహెచ్‌ కూడా సుమారు 5 శాతం పడిపోయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇలా లగ్జరీ బ్రాండ్ల షేర్లు పతనం అవ్వడం.కుబేరుడైన బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌పై తీవ్రంగానే పడిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Bernard Arnault loses 11 billion dollars in one day

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube