తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి( Renuka Chowdhury ), యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ ( Anil Kumar )ను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో వీరిద్దరూ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే మూడు సెట్ల నామినేషన్ల పత్రాలను అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
ముందుగా వీరికి సీఎం రేవంత్ రెడ్డి బీ-ఫామ్( CM Revanth Reddy ( లను అందజేశారు.అనంతరం అసెంబ్లీకి చేరుకుని నామినేషన్లను దాఖలు చేశారు.కాగా ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు దీపాదాస్ మున్షీ, దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు.
అయితే తెలంగాణలో మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు( Congress candidates) నామినేషన్లను దాఖలు చేశారు.