అఖిరా డెబ్యూ చిత్రంపై రేణు దేశాయ్ క్లారిటీ.. అవన్నీ అవాస్తవాలే అంటూ!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వీరిద్దరూ సినిమాలు చేస్తున్న సమయంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

 Renu Desai Birthday Wishes Akira Nandan And Share Kick Boxing Practice Video , R-TeluguStop.com

ఈ దంపతులకు అఖిరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అన్న విషయం తెలిసిందే.అయితే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ పెళ్లి చేసుకున్న తర్వాత అనంతరం కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే.

విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ వీరిద్దరూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు.

ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అయిన అఖిరా నందన్ తాజాగా ఏప్రిల్ 8న తన 18 వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు.

అఖిరా నందన్ పుట్టినరోజు సందర్భంగా తల్లి రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక స్పెషల్ వీడియోని షేర్ చేయగా ఆ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రేణు దేశాయ్ షేర్ చేసిన ఆ వీడియోలో అఖిరా నందన్ బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు.

ఈ వీడియోను చూసిన పవర్ స్టార్ అభిమానులు అఖిరా నందన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అతనికి అంతా మంచే జరగాలి అని కోరుకుంటున్నారు.

అంతేకాకుండా ఆ వీడియోలో బాక్సింగ్ నేర్చుకుంటున్న అఖిరా నందన్ ను చూసిన అభిమానులు తండ్రికి తగ్గ తనయుడు అంటూ అఖిరా నందన్ ఫై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఈ వీడియో స్పందించి,తన కొడుకుకి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు రాసుకొచ్చింది రేణు దేశాయ్. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్స్ అకీరా త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ ప్రచారం చేయగా దాన్ని రేణు దేశాయ్‌ తప్పుపట్టింది.

అతడికి యాక్టర్‌ అవ్వాలని లేదని కుండ బద్ధలు కొట్టినట్లుగా చెప్పింది.అంతేకాకుండా అతడు ఇప్పటివరకు ఏ సినిమాకు సంతకం చేయలేదని, దయచేసి పుకార్లను నమ్మవద్దని అని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube