రోజుకు నాలుగు గంటలు అదే పనట!

మాస్ రాజా రవితేజ గతకొంత కాలంగా సరైన హిట్లు లేక సతమతమవుతున్నాడు.రీసెంట్‌గా డిస్కో రాజా అనే సినిమాతో వచ్చిన రవితేజ మంచి విజయాన్ని అందుకుందామని అనుకున్నాడు.

 Raviteja, Ramesh Varma, Krack, Gym, Niddhi Aggarwal, Malavika Sharma-TeluguStop.com

కానీ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులకు పెద్దగా ఎక్కకపోవడంతో ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.ఇక తన నెక్ట్స్ మూవీని ‘క్రాక్’ అనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు.

గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తు్న్నాడు.కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని వీర మూవీ దర్శకుడు రమేష్ వర్మతో తీయాలని ఫిక్స్ అయ్యాడు.

ఇక ఈ సినిమా కోసం రవితేజ తీవ్రంగా కష్టపడుతున్నాడు.రోజుకు నాలుగు గంటలు జిమ్‌లో చెమటోడుస్తున్న రవితేజ, మరోసారి అదిరిపోయే లుక్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని తెలుస్తోంది.

ఈ సినిమాలో డ్యుయెల్ రోల్ చేస్తున్న రవితేజ ఓ పాత్రలో ఎన్నారైగా కనిపిస్తే, మరొకటి పూర్తి మాస్ పాత్ర అని తెలుస్తోంది.ఈ పాత్ర కోసమే రవితేజ కండలు పెంచుతున్నాడట.

ఇక ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్‌ను అతిత్వరలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube