మాస్ మహా రాజా రవితేజ హీరోగా వరుస సినిమా లు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్దం గా ఉన్నాయి.రికార్డ్ స్థాయి వసూళ్లను ఆయన సినిమా లు దక్కించుకునేందుకు క్యూ కట్టాయి.
ఇటీవల వచ్చిన ఖిలాడి సినిమా నిరాశ పర్చినా కూడా తదుపరి సినిమా రామా రావు ఆన్ డ్యూటీ సినిమా మాత్రం ఖచ్చితంగా ఓ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.రికార్డు లను లక్ష్యంగా చేసుకుని ప్రతి ఒక్కరు రవితేజ సినిమా ల గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరి కొందరు సినిమా ల్లో ఆయన ప్రాభవం తగ్గింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలో రవితేజ హీరోగా నటించిన రామా రావు ఆన్ డ్యూటీ సినిమా నుండి విడుదల అయిన ఈ స్టిల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ స్టిల్ లో రవితేజ ను చూస్తుంటే పదేళ్ల క్రితం వచ్చిన కిక్ సినిమా లో ఎలా అయితే ఉన్నాడో అలాగే ఉన్నాడు.ఈయన లో ఏమాత్రం మాస్ తగ్గలేదు.
అలాగే ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.మాస్ మహా రాజా రవితేజ ఏమాత్రం తగ్గలేదు.
కుమ్మేయడమే తరువాయి అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో రవితేజ ఈ స్టిల్ కు అభిమాను లు తెగ ఫీల్ అయ్యి ఫిదా అవుతున్నారు.
హీరోయిన్ తో ఇలాంటి రొమాంటిక్ ఫోజులు ఇచ్చి రవితేజ చాలా రోజులు అయ్యింది.కనుక కచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.రామా రావు ఆన్ డ్యూటీ సినిమా కు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇక రవితేజ తర్వాత సినిమాల విషయానికి వస్తే ఈయన రాక్షసుడు, ధమాకా మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో రాబోతున్నాడు.
ఇవి కాకుండా చిరంజీవి సినిమాలో కూడా నటించాడు.అది త్వరలో విడుదల కాబోతుంది.