భార్య అలియా భట్ ప్రోత్సాహం వల్లే యానిమల్ లో ఆ సీన్లలో నటించా.. రణ్ బీర్ కామెంట్స్ వైరల్!

రణ్ బీర్ కపూర్( Ranbir Kapoor ) తన సినీ కెరీర్ లో నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తు కాగా యానిమల్ సినిమా మరో రేంజ్ లో ఉంది.ఈ సినిమాలోని కొన్ని సీన్లలో రణ్ బీర్ నటనను చూసి అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.

 Ranbir Kapoor Comments About Alia Bhatt Support Details Here Goes Viral In Soci-TeluguStop.com

అయితే రణ్ బీర్ కపూర్ తాజాగా యానిమల్ సినిమా( Animal Movie ) గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.యానిమల్ మూవీలో ఇంటిమేట్, హింసాత్మక సీన్లలో నటించడానికి రణ్ బీర్ కపూర్ అసౌకర్యంగా ఫీలయ్యారట.

అయితే అలియా భట్( Alia Bhatt ) ప్రోత్సహించడంతో ఎలాంటి బెరుకు లేకుండా ఆ సీన్స్ లో నటించానని రణ్ బీర్ కపూర్ చెప్పుకొచ్చారు.ఒక నటుడిగా నాకంటూ హద్దులు ఉంటాయని ఆ హద్దులు ఎప్పుడూ దాటలేదని రణ్ బీర్ అన్నారు.యానిమల్ కథ విన్న సమయంలో చాలా భయపడ్డానని కొన్ని సీన్స్ లో ఇలా చేయాలా? వద్దా? అని అనిపించిందని రణ్ బీర్ పేర్కొన్నారు.ఆ సమయంలో అలియా భట్ సినిమా కోసమే చేస్తున్నావని అది కేవలం పాత్ర మాత్రమేనని చెప్పేదని రణ్ బీర్ కామెంట్లు చేశారు.
అలియా భట్ చెప్పిన విషయాలు నాలో స్పూర్తి నింపాయని ఆయన అన్నారు.సినిమాకు సంబంధించిన ప్రతి సీన్ ను అలియా భట్ తో చర్చించేవాడినని రణ్ బీర్ అన్నారు.

యానిమల్ సినిమా విషయంలో అలియా భట్ సపోర్ట్ మరవలేదనిదని రణ్ బీర్ అన్నారు.యానిమల్ మూవీ( Animal Movie Collections ) ఫుల్ రన్ లో 900 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఓటీటీ రిలీజ్( Animal OTT Release ) కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతోంది.అలియా భట్, రణ్ బీర్ కపూర్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube