రామ్ పోతినేని,( Ram pothineni ) బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద మూవీ( Skanda movie ) ట్రైలర్ తాజాగా విడుదలైంది.యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.
అయితే ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ట్రైలర్ లో ఏ మాత్రం కొత్తదనం లేదని చెబుతున్నారు.బోయపాటి శ్రీను గత సినిమాలను మిక్స్ చేస్తే ఈ సినిమా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ట్రైలర్ లో సరైనోడు, జయ జానకి నాయక ( Jaya Janaki Nayaka )ఛాయలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే బీ, సీ సెంటర్ల ఆడియన్స్ ను టార్గెట్ చేసేలా ట్రైలర్ ఉండటం గమనార్హం.ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ సమయానికి మరో ట్రైలర్ ను రిలీజ్ చేస్తే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు.బోయపాటి యాక్షన్ సీన్లతో ట్రైలర్ ను నింపేశారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
స్కంద మూవీ సక్సెస్ సాధించడం రామ్ బోయపాటి కెరీర్ కు కీలకమని చెప్పవచ్చు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ ఖాతాలో సరైన హిట్ లేదు.రెడ్, ది వారియర్ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.బోయపాటి శ్రీను సీనియర్ హీరోలతో సక్సెస్ సాధిస్తున్నా యంగ్ హీరోలను డీల్ చేయడంలో తడబడుతున్నాడని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
స్కంద ట్రైలర్ విషయంలో వస్తున్న నెగిటివ్ కామెంట్ల గురించి బోయపాటి శ్రీను ( Boyapati Srinu ) ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.70 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ చేసిన ఈ సినిమా సక్సెస్ సాధించడం సినిమా ఇండస్ట్రీకి సైతం కీలకమని చెప్పవచ్చు.రామ్ బోయపాటి శ్రీను బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సెప్టెంబర్ నెల 15వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.