బోల్డ్ డైరెక్టర్‌తో చరణ్ పాన్ ఇండియా మూవీ..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

 Ram Charan Next Movie With Sandeep Reddy Vanga, Ram Charan, Sandeep Reddy Vanga,-TeluguStop.com

కాగా ఈ సినిమాతో తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా చరణ్ తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఇప్పటికే పలువురు డైరెక్టర్స్‌తో సంప్రదింపులు జరిపాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే చరణ్‌కు అర్జున్ రెడ్డి వంటి బోల్డ్ కంటెంట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఓ స్టోరీలైన్ వినిపించాడని, దానికి చరణ్ ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది.దీంతో ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు దర్శకుడు సందీప్ రెడ్డి రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాను పాన్ ఇండియా సబ్జెక్టుగా తెరకెక్కించేందుకు సందీప్ రెడీ అవుతున్నాడు.

ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారుతున్న చరణ్, ఈ సినిమాతో మరింత స్టార్‌డంను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు.మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో, అసలు ఈ కాంబినేషన్ నిజంగానే సెట్ అవుతుందో లేదో తెలియాలంటే మాత్రం సినిమా గురించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇక ఈ సినిమా ప్రకటన కోసం మెగా ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.అటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube