బాలీవుడ్ లెజండరీ యాక్టర్స్ అయిన రాజ్ కపూర్,దిలీప్ కుమార్ ఇళ్లను పాకిస్థాన్ ప్రభుత్వ వారసత్వ సంపదగా గుర్తించి నిధులను కేటాయించినట్లు తెలుస్తుంది.ఒకప్పటి బాలీవుడ్ లెజండరీ యాక్టర్ రాజ్‌కపూర్ పూర్వీకులు పెషావర్ లోని ఖిస్సా ఖ్వాని జజార్ లో కపూర్ హవేలీ నిర్మించారు.
రాజ్‌కపూర్ అక్కడే జన్మించారు.అవిభాజ్య భారతదేశం రెండు ముక్కలు కావడం తో అప్పటిలో కొందరు పాకిస్థాన్ నుంచి భారత్ కు వలస వచ్చారు.
ఈ క్రమంలో సుప్రసిద్ధుల ఇళ్లు కొన్ని గతస్మృతులకు చిహ్నాలుగా మిగిలి ఉన్నాయి.హిందీ చిత్రసీమను ఏలిన పృథ్వీ రాజ్‌కపూర్, దిలీప్‌కుమార్‌ల పూర్వీకుల ఇళ్లు కూడా అక్కడే ఉన్నాయి.
అయితే వాటిని కూల్చివేసి కాంప్లెక్స్ కట్టాలన్న ప్రయత్నాలకు పాక్ ప్రభుత్వం బ్రేక్ వేసింది.ఖైబర్ ఫఖ్తున్వాలో ఉన్న ఈ భవంతులను భద్రపరచాలని నిర్ణయించింది అక్కడి తాత్కాలిక ప్రభుత్వం.
కొద్దిగా శిథిలావస్థకు చేరుకున్న ఈ భవంతులకు మరమత్తులు చేసి భవిష్యతరాలకు వాటి గొప్పదనాన్ని తెలియచేయాలనుకుంటోంది.చారిత్రక ప్రాధాన్యం గల వీటిని కూల్చివేయకుండా.
వారసత్వ సంపదగా గుర్తించేందుకు అధికారులు యత్నిస్తున్నారు.ఖైబర్ పఖ్తున్వా పురావస్తు శాఖ ఈ రెండు భవనాలను కొనుగోలు చేయాలనుకుంటోంది.
పెషావర్ నగరం నడిబొడ్డున ఉన్న ఈ భవంతుల ధరను నిర్ణయించడానికి డిప్యూటీ కమిషనర్‌కు పురావస్తుశాఖ ఉత్తరం కూడా రాసినట్లు తెలుస్తుంది. రాజ్ కపూర్ పూర్వీకుల నివాసాన్ని కపూర్ హవేలీ అని పిలుస్తారు.
ఇక దిలీప్‌కుమార్ (మహ్మద్ యూసఫ్‌ఖాన్) పూర్వీకులకు చెందిన భవంతి కూడా అక్కడే ఉంది.ప్రస్తుతం ఇది కూడా పాడుపడింది.
2014 లో అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం దీనిని జాతీయ వారసత్వంగా ప్రకటించడం తో ఇప్పుడు ఆ రెండు భవంతులను వారసత్వ సంపదగా ప్రకటించారు.
అయితే రెండు భవనాల యజమానులు గతంలో వీటిని పడగొట్టి కమర్షియల్ ప్లాజాలను నిర్మించాలనుకున్నారు.
అయితే చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆ భవంతులను రక్షించాలని పురావస్తు శాఖ నిర్ణయించి లేఖలు కూడా రాయడం తో ఇప్పుడు ఆ రెండు భవంతులను వారసత్వ సంపదగా కొనసాగించాలని నిర్ణయించింది.