ఇది ఆడకుంటే ఇక దుఖానం సర్దేసుకోవడమేనా?

ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోగా పరిచయం అయిన రాజ్‌ తరుణ్‌ వరుసగా మంచి సినిమాలు చేశాడు.దాంతో ఈయనకు మంచి గుర్తింపు దక్కింది.

 Raj Tarun Iddari Lokkam Okkate Movie Latest Update-TeluguStop.com

అయితే ఆ గుర్తింపు మూడు నాళ్ల ముచ్చటే అయ్యింది.ఏం చేసినా కూడా ఈయనకు ఫెయిల్‌ తప్ప పాస్‌ అవ్వడం లేదు.

దాంతో చేసేది లేక రాజ్‌ తరుణ్‌ కాస్త బ్రేక్‌ తీసుకున్నాడు.మళ్లీ ఇన్నాళ్లకు ఇద్దరి లోకం ఒక్కటే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

Telugu Raj Tarun, Rajtarun-

ఈ సినిమాను దిల్‌రాజు నిర్మించిన కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందా లేదా అనేది చూడాలి.ఒకవేళ సినిమా ఫలితం తారు మారు అయితే మాత్రం రాజ్‌ తరుణ్‌ హీరోగా తట్టా బుట్టా సర్దేసుకోవాలంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాజ్‌ తరుణ్‌ కూడా అదే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

హీరోగా సినిమాలకు స్వస్థి చెప్పేసే ఉద్దేశ్యంలోనే ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.అయితే సినిమాల్లో మాత్రం అలాగే కొనసాగబోతున్నాడు.

Telugu Raj Tarun, Rajtarun-

హీరోగా సక్సెస్‌ దక్కకుంటే దర్శకుడిగా మారేందుకు యోచిస్తున్నాడు.ఇద్దరి లోకం ఒక్కటే సినిమా ఫలితాన్ని బట్టి వచ్చే ఏడాది దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చే విషయమై ఆలోచిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.సహాయ దర్శకుడిగా అనుభవం ఉన్న రాజ్‌ తరుణ్‌ వద్ద పలు కథలు ఉన్నాయట.వాటిని తెర రూపం తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో ఉన్నాడు.త్వరలోనే హీరోగా రిటైర్‌ అయ్యి దర్శకుడిగా ఈ యువ హీరో ఎంట్రీ ఇస్తాడో లేదంటే హీరోగానే కంటిన్యూ అవుతాడో చూడాలంటే ఇద్దరి లోకం ఒక్కటే సినిమా ఫలితం ఏంటో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube