బాలయ్య హీరోయిన్‌కు సూపర్‌ ఛాన్స్‌

తెలుగులో ‘రక్తచరిత్ర’తో పరిచయం అయిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ రాధిక ఆప్టే ఆ తర్వాత తొగులో బాలయ్యతో వరుసగా ‘లెజెండ్‌’, ‘లయన్‌’ సినిమాలు చేసి సక్సెస్‌లను దక్కించుకుంది.తెలుగులో హీరోల డామినేషన్‌ ఎక్కువగా ఉంటుందని, తాను తెలుగులో ఇకపై నటించను అంటూ చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.

 Radhika Apte May Bag A Role In Rajinikanth Next Movie-TeluguStop.com

ఇక ఈమెకు తాజాగా కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్‌ సరసన నటించే బంపర్‌ ఆఫర్‌ దక్కింది.

త్వరలో రంజిత్‌ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించేందుకు ఇప్పటికే సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

ప్రస్తుతం రజినీ స్టైయిల్‌కు తగ్గట్లుగా రంజిత్‌ ఒక స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడు.ఈ సినిమా అతి త్వరలో ప్రారంభం కాబోతుంది.

ఈ సినిమాలో రజినీకి జోడీగా ఇప్పటి వరకు పలువురు హీరోయిన్స్‌ పేర్లు వినిపించాయి.అయితే తాజాగా తమిళ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సూపర్‌ స్టార్‌కు జోడీగా రాధిక ఆప్టేను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

తెలుగు మరియు తమిళంలో ఈ సినిమా ఓకే సారి తెరకెక్కబోతుంది.తెలుగు మరియు తమిళ వర్షన్‌ల రెండిరటిలోనూ రాధిక ఆప్టేనే హీరోయిన్‌గా కనిపించనుంది.

బాలీవుడ్‌లో తన హాట్‌ హాట్‌ అందాలతో హీరోయిన్‌గా దూసుకు పోతూ, చర్చనీయాంశం అవుతున్న రాధిక ఆప్టేకు తమిళ సూపర్‌ స్టార్‌ సరసన నటించే ఛాన్స్‌ రావడంతో ఎగిరి గంతేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube