తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో డైరెక్టర్ పూరి జగన్నాథ్( Puri Jaganath ) ఒకరు.ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరి సూపర్ హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ గా గుర్తింపు పొందిన పూరీకి ఈ మధ్య కాలంలో పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి.
ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా సక్సెస్ అందుకున్న ఈయన అనంతరం లైగర్ ( Liger ) సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా తరువాత ఈయన రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ ( Double ismart )అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ సినిమా పై పూరి భారీగా అంచనాలు పెట్టుకున్నారు.ఇకపోతే సినిమాల పరంగానే కాకుండ ఈయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఇకపోతే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా తన ఫోటో ఒకటి షేర్ చేశారు.అయితే ఈ ఫోటోలో పూరి గుర్తు పట్టలేనంతగా ఉన్నారు.గుండు లుక్ లో ఉన్న ఈయన ఫోటో చూస్తే తాను అనారోగ్య సమస్యలతో( Health problems ) భాధ పడుతున్నారా అన్న సందేహాలు రాక మానదు.
ఈ విధంగా పూరి జగన్నాథ్ తన ఫోటోని సోషల్ మీడియా( Social media ) వేదికగా షేర్ చేస్తూ ఉదయించే సూర్యుడు అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ పెట్టారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో స్పందిస్తూ అసలు పూరి జగన్నాథ్ ఏంటీ ఇలా మారిపోయారు.ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు అయితే ఈ కామెంట్లపై పూరి టీమ్స్ స్పందిస్తూ ప్రస్తుతం ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారని అయితే వెకేషన్ లో ఉన్నారు అంటూ ఆయన లుక్ గురించి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.