ఇజ్రాయెల్ లో అత్యవసర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధాని బెంజమిన్ నెతన్యాహు..!!

ఇజ్రాయెల్( Israel ).హమాస్ మిలిటెంట్ ల మధ్య బీకరమైన పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే.

 Prime Minister Benjamin Netanyahu Formed An Emergency Government In Israel, Hama-TeluguStop.com

అక్టోబర్ ఏడవ తారీఖు నుండి మొదలైన ఈ యుధ్ధం ఉన్న కొద్ది తీవ్రతరం అవుతూ ఉంది.ఇజ్రాయెల్ మెరుపు దాడులతో గాజాలోని విద్యుత్ ప్లాంట్ మూసివేయడంతో నగరం మొత్తం అంధకారంలోకి వెళ్లిపోయింది.

విద్యుత్ తో పాటు వాటర్ కూడా నిలిపివేయడంతో ఉగ్రవాదులకు కేంద్రంగా ఉన్న గాజానీ ఇజ్రాయెల్..

అష్టదిగ్బంధం చేసింది.గాజా సరిహద్దులను మూసివేయడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు( Prime Minister Benjamin Netanyahu ) సంచలన నిర్ణయం తీసుకున్నారు.విపక్ష నేత బెన్నీ గాంట్జ్ తో కలసి అత్యవసర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ఎమర్జెన్సీ ప్రభుత్వం ఇకనుండి కీలక నిర్ణయాలు తీసుకోబోతుందని స్పష్టం చేశారు.హమాస్ తో జరిగే యుద్ధంకి సంబంధించి.

తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా చూడటంతో పాటు విదేశాలతో సమన్వయం చేసుకోవడం.ఈ ఎమర్జెన్సీ ప్రభుత్వం చేపట్టాల్సిన విధులు అని పేర్కొన్నారు.

ఇవి తప్ప దేశంలో పరిస్థితులు విధివిధానాలతో ఎటువంటి సంబంధం ఉండదని చెప్పుకొచ్చారు.పరిస్థితులు అంత సద్దు మణిగాక ఈ ప్రభుత్వ స్థానంలో తిరిగి సాధారణ ప్రభుత్వం బాధ్యతలు చేపడుతుందని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube