తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని( Chandrababu ) స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ అధికారుల అరెస్టు చేయటం తెలిసిందే.ఈ కేసులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో నెల రోజులకు పైగా ఉన్నారు.
ఈ క్రమంలో రాజకీయ కక్షతోనే చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది సెలబ్రిటీలు ఖండించడం జరిగింది.ఇదిలా ఉంటే రెండు వారాల క్రితం నారా లోకేష్( Nara Lokesh ) నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ముతో భేటీ కావడం తెలిసిందే.
ఆ సమయంలో చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు.
వైసీపీ( YCP ) ప్రభుత్వం విపక్షాలను అణిచివేస్తోందని లోకేష్ వివరించారు.
ఈ సమావేశంలో లోకేష్ తో పాటు టీడీపీ ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు.ఆ సమయంలో సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతి నేడు లోకేష్ ఇచ్చిన ఫిర్యాదు పై.నేడు రాష్ట్రపతి కార్యాలయం నారా లోకేష్ కి లేఖ రాసింది.తెలుగుదేశం ఎంపీలు అందించిన లేఖను కేంద్ర శాఖకు పంపినట్లు స్పష్టం చేయడం జరిగింది.
అలాగే తెలుగుదేశం ఎంపీలు రాసిన లేక పై దృష్టి సారించాలని సూచిస్తూ నారా లోకేష్ కి సమాచారం ఇవ్వటం జరిగింది.