రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.మొన్నటివరకు ఒక పార్టీకి మద్దతు.
ఇచ్చినవారు ఇప్పుడు మరో పార్టీకి మద్దతు ఇవ్వడం వంటివి ఇక్కడ సర్వసాధారణం .అదేవిధంగా 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు తను శాయి శక్తుల కృషి చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) వైసిపి విజయం తర్వాత ఆ పార్టీకి దూరంగానే ఉంటున్నారు.తన సొంత రాష్ట్రం బీహార్ రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు .అంతే కాకుండా ప్రత్యక్షంగా ఏ పార్టీకి రాజకీయ వ్యూహాలను అందించడం లేదు.అయితే పరోక్షంగా తనకు చెందిన ఐ ప్యాక్ ద్వారా రాజకీయ వ్యూహాలు అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఏపీలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ టిడిపి తో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది.
ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) అరెస్టు తరువాత ప్రశాంత్ కిషోర్ ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయం ఇప్పుడు బయటపడింది. చంద్రబాబు అరెస్టు తరువాత న్యాయపరమైన అంశాలను చర్చించేందుకు చాలా రోజుల పాటు నారా లోకేష్( Nara Lokesh ) ఢిల్లీలోనే మకాం వేశారు.ఆ సమయంలోనే లోకేష్ ,ప్రశాంత్ కిషోర్ మధ్య చర్చలు జరిగాయి.
టిడిపికి స్వచ్ఛందంగా సలహాలు , సూచనలు ఇచ్చేందుకు తాను సిద్ధమని ప్రశాంత్ కిషోర్ చెప్పారనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.మొదటినుంచి టిడిపికి రాబిన్ శర్మ వ్యూహ కర్తగా పనిచేస్తున్నారు.
ఆయన పనితీరుపై చంద్రబాబు సంతృప్తి గానే ఉన్నారు.ఇప్పుడు ప్రస్తుతం కిషోర్ కూడా స్వచ్ఛందంగా సలహాలు ఇచ్చేందుకు సిద్ధమవడంతో, చంద్రబాబు కూడా ఖుషీగానే ఉన్నారట.
ప్రస్తుతం టిడిపి వ్యూహకర్త గా పనిచేస్తున్న రాబిన్ శర్మ ప్రశాంత్ కిషోర్ శిష్యుడే .ఆయన వద్ద చాలా పని చేసిన తర్వాతే టిడిపి వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే టిడిపికి ప్రశాంత్ కిషోర్ రాజకీయ సలహాలు అందిస్తున్నారనే విషయం బయటకి పొక్కకుండా ఆ పార్టీ చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గా ప్రచారం జరుగుతోంది .అయితే అసలు ప్రశాంత్ కిషోర్ టిడిపి కోసం ఎందుకు స్వచ్ఛందంగా పనిచేయాలనుకుంటున్నారు ? దీనివల్ల ఆయనకు కలిసొచ్చేది ఏమిటి ? అసలు ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.