గెలిచిన వారిని నెక్స్ట్ టు ఇయర్స్ పడుకోనివ్వను : ప్రకాష్ రాజ్

టాలీవుడ్ మూవీ ఎసోసియేషన్ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా సాగాయి.ఎప్పుడు లేని విధంగా మాటలతోనే ఈ ఎన్నికలపై హీట్ పెంచేశారు.

 Prakash Raj Comments On Mohan Babu And Manchu Vishnu Details, Prakash Raj ,maa,t-TeluguStop.com

ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించాడు.అయితే ఎన్నికలు ముగిసిన వీరి మాటల యుద్ధం మాత్రం ముగియడం లేదు.

ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు మంచు విష్ణు పై.మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై విమర్శలు చేసుకుంటున్నారు.

మొన్నటికి మొన్న మంచు విష్ణు ప్రమాణ స్వీకారం రోజు మోహన్ బాబు ప్రకాష్ రాజ్ పై మెగా ఫ్యామిలీ పై ఇన్ డైరెక్ట్ గా సెటైర్స్ వేసాడు.ఇక తాజాగా ప్రకాష్ రాజ్ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో చాలా విషయాలు తెలిపాడు.ఈ ఎన్నికలపై తన మనసులో ఏముందో చెప్పాడు.”కొంతమంది ఇదంతా మన కుటుంబం.అంటున్నారు.కానీ ఇలాంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇండస్ట్రీలో కొంతమంది చెబుతున్నట్టుగా అందరు ఒకటైతే కాదు.ఇక్కడ ఎవరి ఇగోలు వారికీ ఉన్నాయి.

Telugu Chiranjeevi, Latest, Maa, Manchu Vishnu, Mohan Babu, Heart Rk, Prakash Ra

నా వెనుక ఎవరో ఉన్నారని అంటారు.నన్ను పోటీకి నిలబెట్టాలని ఎవరు నిర్ణయించారు? ఈ దేశంలో నన్ను నిర్ణయించేవారు ఎవరండీ.నా వెనుక చిరంజీవి గారు ఉన్నారని విష్ణు చెప్పిన.మోహన్ బాబు చెప్పిన అది అబద్ధం ఎందుకు అయ్యుండకూడదు? మా సభ్యులలో ఇగో వార్ జరుగుతుందని తెలిసే నేను పోటీ చేయాలనీ నిర్ణయించు కున్నాను.ఇప్పటి వరకు ఉన్నవారిని చుస్తే వారికి అవగాహన లేదనే విషయం నాకు అర్ధమైంది అని ప్రకాష్ రాజ్ తెలిపారు.

Telugu Chiranjeevi, Latest, Maa, Manchu Vishnu, Mohan Babu, Heart Rk, Prakash Ra

నేను నిజాయితీగా గెలవాలి అనుకున్నాను.అలాగే పోటీలో ముందుకు వెళ్ళాను.నేను ఫ్లయిట్ టికెట్స్ బుక్ చేయలేదు.

స్టార్ హోటళ్లు బుక్ చేయలేదు.ఇంటింటికి వెళ్లి చీరలు పంచలేదు.చిన్నవారికి స్వీట్లు ఇవ్వలేదు.60 ఏళ్ళు దాటినా పెద్ద వారిని బెదిరించలేదు.అందుకే నాకు వచ్చిన ఓట్లన్నీ నిజాయతీగా వచ్చినవే.ఈ ఎన్నికల్లో గెలిచింది విష్ణు అయితే మాట్లాడేది మోహన్ బాబు. ఇది ఎలా అర్ధం చేసుకోవాలి.అందుకే గెలిచినా వాళ్ళను ఎప్పటికప్పుడు రిపోర్ట్ అడుగుతూనే ఉంటాను.

నెక్స్ట్ టు ఇయర్స్ వారిని పాడుకోనీయను.అంటూ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube