ఓవర్సీస్ లో మొదలైన సలారోడి ప్రభంజనం..అరగంటలో 10 వేల టిక్కెట్లు!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’ కోసం కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు , ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.ఎప్పుడో సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, మరింత క్వాలిటీ ఔట్పుట్ కోసం పలు సన్నివేశాలను రీ షూట్ చేసి, కొత్తగా ఒక ఐటెం సాంగ్ ని జతపర్చి రీసెంట్ గానే షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టేసారు.

 Prabhas Salaar Movie Advance Bookings Details, Prabhas , Salaar , Advance Boo-TeluguStop.com

డిసెంబర్ 22 వ తారీఖున విడుదల చెయ్యడానికి కావాల్సిన అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.ప్రభాస్ కూడా వచ్చే నెల మొదటి వారం నుండి నాన్ స్టాప్ గా ప్రొమోషన్స్ లో పాల్గొనబోతున్నాడు.

అలాగే డిసెంబర్ 1 వ తేదీన ‘సలార్‘ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చెయ్యబోతున్నారు.ఇది వరకే టీజర్ ని విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చినా కూడా ప్రభాస్ ముఖాన్ని సరిగా చూపించలేదు అనే అసంతృప్తి ఉండేది.

Telugu Salaar, Advance, Prabhas, Prashanth Neel, Premier Shows, Tollywood-Movie

కానీ డిసెంబర్ 1 వ తేదీన విడుదల చెయ్యబొయ్యే ట్రైలర్ తో ఫ్యాన్స్ కి భుక్తాయాసం రావడం తధ్యమని అంటున్నారు మేకర్స్.ఆ రేంజ్ లో ట్రైలర్ షాట్స్ ఉంటాయట.ప్రభాస్ ని ఊర మాస్ యాంగిల్ లో చూసి అభిమానులకు చాలా రోజులే అయ్యింది.ఈ కటౌట్ ని సరిగా వాడుకోవట్లేదే అనే నిరాశ అభిమానుల్లో ఉండేది.

ఈ ‘సలార్( Salaar )’ చిత్రం తో అటువంటి కంప్లైంట్స్ కి ప్రభాస్ చెక్ పెట్టబోతున్నాడని తెలుస్తుంది.ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నార్త్ అమెరికా లో నిన్ననే ప్రారంభించారు.

ఆ దేశం లో ఉన్నటువంటి ప్రధాన థియేటర్స్ అన్నిట్లో దాదాపుగా అడ్వాన్స్ బుకింగ్స్( Advance bookings ) ప్రారంభించగా కేవలం అరగంట వ్యవధి లోనే 10 వేల టికెట్స్ అమ్ముడుపోయాయని, దాదాపుగా మూడు లక్షల రూపాయిల గ్రాస్ నెల రోజుల ముందే వచ్చేసిందని అంటున్నారు.కేవలం ప్రీమియర్ షోస్ నుండే రెండు మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను తియ్యాలని మేకర్స్ చూస్తున్నారు.

Telugu Salaar, Advance, Prabhas, Prashanth Neel, Premier Shows, Tollywood-Movie

గతం లో #RRR చిత్రం కూడా ఇలాగే అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తం పూర్తి అయినా తర్వాత వాయిదా వేశారు.ఇప్పుడు సలార్ విషయం లో కూడా అదే జరిగింది.అంటే ఫైనల్ కలెక్షన్స్ లో కూడా ‘సలార్’ చిత్రం #RRR రేంజ్ లో ప్రభంజనం సృష్టించబోతోందా?, ఒకవేళ అదే మ్యాజిక్ కనుక రిపీట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ సునామి మామూలు రేంజ్ లో ఉండదు.ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ కూడా లేకపోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube