యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తరువాత కొంత గ్యాప్ తీసుకుని తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నాడు.జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వచ్చినా అభిమానులు తప్పకుండా ఫాలో అవుతున్నారు.
ఈ సినిమా ఓ పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
కాగా ఈ సినిమాలో హీరోయిన్గా అందాల భామ పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో అమ్మడి పాత్రకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.ఈ సినిమాలో పూజా హెగ్డే ఓ దురదృష్టవంతురాలిగా నటిస్తోంది.అయితే ప్రభాస్ వల్ల ఆమె అదృష్టవంతురాలిగా ఎలా మారుతుందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.ఈ సినిమా కథ జ్యోతిష్యం ఆధారంగా నడుస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్లో కనిపిస్తాడట.ఇక ఈ సినిమాను గోపీకృష్ణ ప్రొడక్షన్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మి్స్తున్నాయి.మరి ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడుంటుందా అని ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.