బుల్లితెరపై మెరుస్తానంటున్న అక్కినేని కోడలు

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత పెళ్లి తరువాత కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.ఇటీవల ఈమె నటించిన జాను సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది.

 Samantha To Make Entry As Reality Show Host-TeluguStop.com

ఈ సినిమాలో సమంత నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి.ఇక ఇప్పుడు ఆమె తన నెక్ట్స్ మూవీలను వరుసగా లైన్‌లో పెట్టి బిజీగా ఉంది.

అటు వెబ్ సిరీస్‌లలో కూడా నటించేందుకు ఒప్పుకున్న సమంత, త్వరలో మరో కొత్త అవతారంలో కనిపించేందుకు రెడీ అవుతోంది.

ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఓ ప్రముఖ ఓటీటీ యాప్‌లో త్వరలో నిర్వహించే ఓ రియాలిటీ షోలో హోస్ట్‌గా వ్యవహరించేందుకు సమంత రెడీ అవుతోంది.

ఈ షో గతంలో అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ తరహాలో ఉంటుందని తెలుస్తోంది.ఈ షోకు సమంత హోస్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు నిర్వాహకులు ఆశిస్తున్నారు.

అటు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇప్పుడు రియాలిటీ షోలతో యమబిజీగా ఉన్న సమంత, వ్యక్తిగత జీవితంలోనూ తనదైన మార్క్ వేసుకుంటోంది.నాగచైతన్య భార్యగా, అక్కినేని కోడలిగా ఆమె తనదైన గుర్తింపుతో అభిమానులను సంపాదించుకుంది.

మరి హోస్ట్‌గా సమంత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని ఆమె ఫ్యాన్స్ ఆశగా చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube