అయోధ్య రామ మందిరం(Ram Mandir) జనవరి 22వ తేదీ జరుగుతున్న సంగతి మనకు శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నారు.ఇక ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు క్రీడా రంగానికి చెందిన ప్రముఖులందరూ కూడా హాజరు కాబోతున్నారు.
ఇక ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా భోజనాలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసింది.ఇప్పటికే ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన పనులన్నింటిని కూడా రామ మందిరం ట్రస్ట్ వారు పూర్తి చేసే పనులలో ఉన్నారు.
ఇకపోతే అయోధ్య రామ మందిరానికి చాలామంది కానుకలుగా పంపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు పొందినటువంటి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కూడా భారీగా విరాళం ఇచ్చారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ విషయం గురించి ఎక్కడ అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ కూడా ప్రభాస్ విరాళం ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.కొందరు 20 కోట్లు ఇచ్చారంటూ ప్రచారం చేయగా మరికొందరు 50 కోట్లు ఇచ్చారు అంటూ ప్రచారం చేస్తున్నారు.
ఈ విధంగా ప్రభాస్ డబ్బు ఇచ్చారనే విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ నెటిజన్స్ మాత్రం ఈ వీడియోలపై ఫన్నీగా రియాక్ట్ అవుతూ ఉన్నారు.కొంతమంది 20 కోట్లు ఇచ్చారు అంటూ పోస్టులు చేయగా.ఈ పోస్ట్ పై కొంతమంది స్పందిస్తూ ఇప్పటికే ప్రభాస్ ఆది పురుష్( Adipurush ) సినిమా చేసి శ్రీరాముడిని చాలా ఘోరంగా అవమానించారు.ఆ పాపం పోవాలి అంటే ఈ మాత్రం విరాళం ఇవ్వాల్సిందేలే అంటూ కొందరు కామెంట్స్ చేయగా మరికొందరు మాత్రం సింపతి కొట్టేయడానికి ఇలా విరాళంగా డబ్బు పంపించి ఉంటారు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.