ప్రభాస్( Prabhas ).గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.
అంతేకాకుండా ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.నేడు డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు రెండు మూడు రోజుల నుంచి అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయడంతో పాటు సోషల్ మీడియాలో ప్రభాస్ పేరును మారుమోగిస్తున్నారు.
ప్రతి సంవత్సరం లాగే కాకుండా ఈసారి కాస్త కొత్తగా ఘనంగా ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలను ఏర్పాటు చేస్తున్నారు.ఇప్పటికే ప్రభాస్ భారీ కటౌట్లను ఏర్పాటు చేసి పూలదండలు వేసి పాలాభిషేకలు చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు డార్లింగ్ ఫాన్స్.

మునుపెన్నడూ లేని విధంగా ఇప్పటివరకు ఏ హీరోకు జరగిని విధంగా ప్రభాస్ బర్త్ డే పార్టీ( Prabhas Birthday Party ) ఉండనుంది.ఇప్పటికే ఆ పనులను ఫ్యాన్స్ పూర్తిచేశారు.శ్రేయాస్ మీడియా( Shreyas Media ) ప్రభాస్ ఫ్యాన్స్ తో కలిసి భారీ కటౌట్ ను ఏర్పాటు చేసింది.దుర్గా పూజ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఈ కటౌట్ ను నేడు లాంచ్ చేయనున్నారు.
అయితే ఇప్పటి వరకు ఇలాంటి కటౌట్ ను ప్రేక్షకులు కాదు.ప్రజలు కూడా చూసి ఉండరు.సలార్ లుక్ లో ప్రభాస్ కటౌట్ మరణ మాస్ లా కనిపిస్తుంది.దీనిపై హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అని రాసి ఉంది.ఇప్పటికే అనగా నేడు ఉదయం 10.30 కు ఈ కటౌట్ ను ప్రభాస్ ఫ్యాన్స్ లాంచ్ చేశారు.కూకట్ పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్స్ ఈ బర్త్ డే వేడుకలు జరుగుతున్నాయి.

ప్రభాస్ ఫ్యాన్స్ అందరు ఈ వేడుకకు హాజరుకానున్నారు.ఇప్పటివరకు ఏ హీరోకు ఇలాంటి అరుదైన గౌరవం దక్కలేదు.కాగా నేడు ప్రభాస్ బర్త్ డే కానుకగా.
సలార్, కల్కి సినిమాల నుంచి సర్ప్రైజ్ వీడియోలు రిలీజ్ అవుతున్నాయని టాక్ నడుస్తోంది.ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రభాస్ నటించిన సలార్ సినిమా( Salaar Movie ) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాలో నటిస్తున్నారు.నేడు ప్రభాస్ సినిమాలకు సంబంధించి వలస అప్డేట్ అని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అదే కనుక జరిగితే ప్రభాస్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుడం ఖాయం.