రాధేశ్యామ్‌ : కాస్త అటు ఇటు అయితే సూర్య పరిస్థితి అస్సామే!

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్‌ సినిమా విడుదలకు సిద్ధమైంది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు దర్శకత్వం రాధాకృష్ణ వహించిన విషయం తెలిసిందే.

 Prabhas And Surya Movies Radheshayam And Et Movies Clash At Boxoffice , Boxoffi-TeluguStop.com

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాకు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఈ నెల 11 వ తారీకు న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతున్న రాధేశ్యామ్‌ కి తమిళ సినిమా ఈటి పోటీ గా మారింది.

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఈటి సినిమా పై ప్రేక్షకుల్లో ముఖ్యంగా అక్కడి ప్రేక్షకుల కు ఆసక్తి ఎక్కువగానే ఉంది.ఆయన నటించిన ఆకాశమే నీ హద్దురా మరియు జై భీమ్ సినిమాలు వరుసగా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈటి సినిమా కూడా కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో సూర్య అభిమానులు ఉన్నారు.

Telugu Jai Bhim, Prabhas, Pre, Radhakrishna, Radheshyam, Surya, Surya Et, Tamil

అందుకే ఈటి సినిమా కు అక్కడ భారీ ఎత్తున ఓపెనింగ్ దక్కే అవకాశం ఉంది.ఆ సమయంలోనే అక్కడ రాధేశ్యామ్‌ కి కాస్త ఇబ్బంది తప్పకపోవచ్చు అంటున్నారు.ఒక్క రోజు తేడాతో రాబోతున్న ఈ రెండు సినిమాలు ఎంతో కొంత మూల్యం అయితే చెల్లించుకోవాల్సి రావచ్చు.అయితే రాధేశ్యామ్‌ విడుదలైన ముందు రోజు విడుదలకు ఈటి సినిమా ఫలితం అటూ ఇటూ అయితే మాత్రం తమిళ నాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా దారుణమైన కలెక్షన్లు చవి చూడాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా హిట్టయితే ఒక మోస్తరు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.కానీ ప్లాప్‌ అయితే మాత్రం రాధేశ్యామ్‌ వైపు మొగ్గు చూపుతారు.కనుక ఈటి కి జనాలు రాకపోవచ్చు.సూర్య కి ఐదు సంవత్సరాలుగా థియేట్రికల్ సక్సెస్ లేదు.

దాంతో ఈ సినిమా ఎలాగైనా సక్సెస్ సాధించాలని ఆయన కోరుకుంటున్నాడు.మూడేళ్ల తర్వాత సూర్య థియేటర్ ద్వారా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube