బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ కు ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఉన్నారు.ఈయన సినిమా కోసం ఎదురు చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు.
అయితే బాహుబలి తర్వాత వచ్చిన రెండు సినిమాలతో ఈయన ఫ్యాన్స్ ను పూర్తిగా నిరాశ పరిచాడు.దీంతో ఇప్పుడు అందరి ఆశలు నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న ఆదిపురుష్ సినిమా మీదనే ఉన్నాయి.
ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ముగించుకుంది.ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ సినిమా నుండి ఒక్క అప్డేట్ కూడా రాలేదు.
ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు ఆదిపురుష్ మేకర్స్.ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసారు.
అయోధ్యలో మేకర్స్ ఈ ఆదిపురుష్ టీజర్ ను రిలీజ్ చేసారు.ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా టీజర్ కొత్త రికార్డులను సృష్టించింది.
కేవలం 16 గంటల్లోనే ఈ టీజర్ 933K కంటే ఎక్కువ లైక్స్ సాధించడమే కాకుండా 56 మిలియన్స్ సాధించి హిందీలో ఇప్పటి వరకు హైయెస్ట్ లైక్స్ మరియు వ్యూస్ సాధించిన టీజర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.
దీంతో అక్కడి సినిమాలన్నిటిని వెనక్కి నెట్టి మరీ డార్లింగ్ తన క్రేజ్ ఏంటో చూపించాడు.ఇక ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల ఖర్చు చేసినట్టు టాక్.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12, 2023న రిలీజ్ కానుంది.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే.సీతగా కృతి సనన్ నటిస్తుంది.
లంకేశ్వరుడు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటిస్తున్నాడు.