యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) నటించిన ఆదిపురుష్ సినిమా( Adipurush ) మరి కొన్ని గంటల్లో యూఎస్ లో స్క్రీనింగ్ మొదలు అవ్వబోతుంది.ఇండియాలో రేపు ఉదయం నుండే సందడి మొదలు అవ్వబోతుంది.
దేశ వ్యాప్తంగా ప్రభాస్ ఆదిపురుష్ సందడి నెలకొన్ని నేపథ్యంలో అభిమానులు ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు.అయితే ఈ సినిమా లో ప్రేక్షకులు రాముడిగా చూడబోతున్నది మొత్తం ప్రభాస్ ను కాదు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కోసం చాలా తక్కువ రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నాడు.

ఆ సమయంలో అంత భారీ సినిమా లో ప్రభాస్ ను చూపించడం అంత తక్కువ సమయంలో సాధ్యం కాదు.కనుక కొన్ని సన్నివేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో క్రియేట్ చేసిన ప్రభాస్ ను చూడబోతున్నట్లుగా తెలుస్తోంది.కేవలం ప్రభాస్ మాత్రమే కాకుండా హీరోయిన్ కృతి సనన్( Kriti Sanon ) ఇతర అన్ని పాత్ర లను కూడా ఒరిజినల్ కాకుండా గ్రాఫిక్ మోడల్ ను చూడబోతున్నాం.అచ్చు గుద్దినట్లుగా అట్లే ఉంటారు.85 శాతం వరకు పోలిక ఉంటుంది.కొందరు గుర్తించలేని విధంగా ఉంటారు అనడంలో సందేహం లేదు.ప్రభాస్ ఒరిజినల్ గా ఈ సినిమాలో సగానికి పైగా నటించినా చాలు అన్నట్లుగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో గ్రాఫిక్స్ ప్రభాస్ మరియు ఇతర క్యారెక్టర్ లకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ లుక్ కాస్త విభిన్నంగా ఉన్నా కూడా ఇతర పాత్రలు మాత్రం చాలా వరకు పోలికలతో ఉన్నాయి.ఆదిపురుష్ సినిమా లో రావణుడి పాత్ర ను బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పోషించాడు.బాలీవుడ్ తో పాటు అన్ని వర్గాల వారు ఈ సినిమా ను చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.