వాళ్ల తండ్రి మాదిరిగానే అంటూ జగన్ ని పొగిడిన జేసీ ప్రభాకర్ రెడ్డి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాను గాలి వీచినా గాని తాడిపత్రి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవడం సంచలనం సృష్టించింది.అయితే తెలుగుదేశం పార్టీ గెలుపుకి కారణం జేసి బ్రదర్స్ అని నియోజకవర్గంలో అందరూ చెబుతున్న మాట.

 Prabhakar Reddy Praised Jagan As Their Father Ys Jagan, Prabhakar Reddy, Tadipat-TeluguStop.com

కార్యకర్తల కు ధైర్యం చెబుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా పోటీ చేసి అధికార పార్టీని ఎదుర్కొని దాదాపు నియోజకవర్గంలో మ్యాజిక్ ఫిగర్ సాధించడమే కాక వామపక్షాల మద్దతు కూడా కలుపుకొని మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జెసి ప్రభాకర్ రెడ్డి సీఎం జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు.

వాళ్ల చేతిలో అధికారం ఉంది, వాళ్లు అనుకుంటే మున్సిపల్ చైర్మన్ గెలిచే ఛాన్స్ కూడా ఉంది.కానీ ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించారు.అందువల్లే మున్సిపల్ చైర్మన్ అయ్య గలిగాను వాళ్లకి కూడా కృతజ్ఞతలు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.  వాళ్ల తండ్రి వైఎస్ మాదిరిగానే జగన్ కి కూడా నైతిక విలువలు ఉన్నాయని పేర్కొన్నారు.

వైయస్ కి తాను పెద్ద శిష్యుడిని అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయనపై ఉన్న అభిమానాన్ని తాజాగా చాటుకున్నారు. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube