గొప్ప వ్యక్తిని 73 సంవత్సరాల వయస్సులో బాధ పెట్టొద్దు.. పూనమ్ సంచలన ట్వీట్ వైరల్!

చంద్రబాబు నాయుడు( Chandrabaabu ) అరెస్ట్ విషయంలో ప్రజల్లో, రాజకీయ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి.కొంతమంది తప్పు చేయడం వల్లే చంద్రబాబు అరెస్ట్ అయ్యాడని చెబుతుండగా మరి కొందరు మాత్రం కుట్రపూరితంగా చంద్రబాబును ఈ కేసులో ఇరికించారని చెబుతున్నారు.

 Poonam Kaur Sensational Tweet About Chandrabaabu Naidu Details Here Goes Viral-TeluguStop.com

ఇప్పటికే అశ్వనీదత్, ( Ashwini Dutt )రాఘవేంద్రరావు, నట్టికుమార్ మరి కొందరు సినీ ప్రముఖులు చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడారు.

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం తీవ్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై, జగన్ పై ఫైర్ అయిన సంగతి తెలిసిందే.అయితే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలో పలువురు సెలబ్రిటీలను టార్గెట్ చేసి కామెంట్లు చేసిన పూనమ్ కౌర్ చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ట్వీట్ చేశారు.

చంద్రబాబు ( Chandrabaabu )ప్రజల కోసం ఎంతో చేశారని ఆమె అన్నారు.ప్రజలకు ఎంతో మేలు చేసిన చంద్రబాబును 73 సంవత్సరాల వయస్సులో జైలులో పెట్టి ఇబ్బంది, బాధ పెట్టవద్దని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు.

చంద్రబాబు నాయుడు ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని మానవతా దృక్పథంతో విజ్ఞప్తి చేస్తున్నానని పూనమ్ కౌర్ కామెంట్లు చేశారు.చంద్రబాబు నాయుడిని జైలులో ఉంచడం సరి కాదని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు.

పూనమ్ కౌర్ చేసిన కామెంట్ల విషయంలో ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.సీనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు ఇబ్బంది పెట్టారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.పూనమ్ కౌర్ ఇలాంటి వివాదాలలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారో అర్థం కావడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.పూనమ్ కౌర్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సినిమాలకు దూరంగా ఉన్నా పూనమ్ కౌర్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.కెరీర్ విషయంలో పూనమ్ కౌర్ ఆచితూచి అడుగులు వేయాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube