యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే.యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాని పీరియాడిక్ లవ్ స్టొరీగా దర్శకుడుఆవిష్కరించాడు.
ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్ అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి.చాలా కాలం తర్వాత ప్రభాస్ చేస్తున్న రొమాంటిక్ లవ్ స్టొరీ చిత్రం రాదే శ్యామ్ కావడంతో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్టార్ హీరోలు ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత ప్రేమకథ చిత్రాలని పూర్తిగా పక్కన పెడతారు.అయితే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఉంటూ ఒక ప్రేమకథని చేయడం అనేది పెద్ద సాహసం అని చెప్పాలి.
మరి రాధాకృష్ణ ప్రభాస్ ఫ్యాన్స్ ని మెప్పించే స్థాయిలో ఏ విధంగా ఈ ప్రేమకథని తెరపై ఆవిష్కరించబోతున్నాడు అనేది ఆసక్తికరంగానే ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై హీరోయిన్ పూజా హెగ్డే ఆసక్తికర వాఖ్యలు చేసింది.ఫ్యాషన్‌పరంగా భారతీయ సినిమాల్లో రాధేశ్యామ్ ప్రత్యేకంగా నిలిచిపోతుందని తెలిపింది.భారతీయ నేపథ్యంలో గతంలో చాలా పీరియాడిక్ సినిమాలొచ్చాయి.
కానీ ఈ జోనర్లో యూరప్ నేపథ్య చిత్రాలు రాలేదు.రాధేశ్యామ్ 70 దశకాల్లోని యూరోప్‌ను ఆవిష్కరిస్తుంది.
సినిమాలోని కొన్ని డ్రీమ్ సీక్వెన్స్‌లో నాటి ఇటలీ సంస్కృతిని తెలియజెప్పే గౌన్స్, కోట్స్, టోపీలను ఉపయోగించారు.కాస్ట్యూమ్స్ అప్పటి రోజుల్ని గుర్తుకుతెస్తాయి.
ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాలో ఇలాంటి ఫ్యాషన్‌ను చూపించలేదనుకుంటున్నా అని చెప్పింది.సినిమాల్లో పాత్ర తాలూకు స్వభావాన్ని ష్యాషన్ ప్రతిబింబిస్తుందని పూజాహెగ్డే పేర్కొంది.
ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యేకంగా నిలిచిపోయే స్థాయిలో రాధేశ్యామ్ ఉంటుందని ఆమె అంటున్న మాటలు ఇప్పుడు సినిమా రేంజ్ ని మరింత పెంచేశాయి.