కెరియర్ ఆరంభంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినాకైఫ్ తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాలు చేసింది.ఈ రెండింటిలో ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా, మరొకటి డిజాస్టర్ అయ్యింది.
అయితే ఈ రెండు సినిమాలు కేవలం ఆమె డబ్బు కోసమే యాక్ట్ చేసినట్లు ఉంటుంది.దీనికి కారణం ఆ రెండు సినిమాలలో కత్రినాకైఫ్ పెర్ఫార్మెన్స్ చాలా వరస్ట్ గా ఉంటుంది.
యూకే నుంచి వచ్చిన కత్రినా నటనలో ఓనమాలు నేర్చుకుంటున్న సమయంలో తెలుగులో ఆ సినిమాలు చేసింది.తరువాత ఈ అమ్మడు బాలీవుడ్ లో నటిగా ప్రూవ్ చేసుకుంది.
తరువాత డాన్స్ స్కిల్స్ పెంచుకొని మంచి డాన్సర్ గా కూడా తనకంటూ ఒక బ్రాండ్ తెచ్చుకొని స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాన్ని సొంతం చేసుకుంది.ఏకంగా ధూమ్ 3లో అమీర్ ఖాన్ కి జోడీగా ఈ అమ్మడు నటించింది.
ఇదిలా ఉంటే కత్రిన కైఫ్ చూపు మళ్ళీ ఇప్పుడు సౌత్ సినిమాలపై పడిందనే టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతం సౌత్ లో సుమారు అందరు స్టార్ హీరోలు పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమాలు చేస్తున్నారు.
ఇలా చేయడం వలన అన్ని బాషలలో హీరోయిన్ గా కనిపించే అవకాశం ఉంటుంది.దానికితోడు పాన్ ఇండియా సినిమా అంటే రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఉంటుంది.దీపికా పదుకునే రెగ్యులర్ బాలీవుడ్ సినిమాలకి తీసుకునే రెమ్యునరేషన్ కంటే రెట్టింపు ప్రభాస్ తో చేస్తున్న పాన్ ఇండియా మూవీ కోసం తీసుకుంటుంది.మిగిలిన హీరోయిన్స్ కి కూడా అలాగే ఇస్తారు.
ఈ నేపధ్యంలో ప్రభాస్, మహేష్ బాబు, విజయ్ లాంటి స్టార్ హీరోలతో పాన్ ఇండియా ఛాన్స్ వస్తే వెంటనే ఒకే చెప్పాలని ఈ అమ్మడు వెయిట్ చేస్తుంది.దానికి తగ్గట్లుగానే సౌత్ సినిమాలపై ఈ మధ్య తన ఇష్టాన్ని కూడా కత్రినా చూపించింది.
ప్రస్తుతం కోలీవుడ్ అజిత్ హీరోగా వాలిమై తర్వాత పాన్ ఇండియా రేంజ్ మూవీ ఒకటి ప్లానింగ్ జరుగుతుంది.ఆ సినిమా కోసం కత్రినాని సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.