షర్మిల పార్టీలో చేరేంత సాహసం చేయలేను

ఖమ్మం జిల్లా కీలక రాజకీయ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) ఇటీవల అధికార బీఆర్ఎస్ పార్టీ ( BRS party )నుండి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.ఆయన్ని పార్టీ సస్పెండ్ చేయడంతో సానుభూతి కలిసి వస్తుందని అంతా భావిస్తున్నారు.

 Ponguleti Srinivas Reddy Don't Want To Join Ysrtp , Ponguleti Srinivas Reddy ,ys-TeluguStop.com

ఇక పొంగులేటి బిజెపి( BJP ) లేదా కాంగ్రెస్( Congress ) పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది.ఆ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా పొంగులేటి నాన్చుతూ వస్తున్నాడు.

బిజెపి ముఖ్య నేతలు పొంగిలేటిపై ఆశలు పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు.అధినాయకత్వం తో ఇప్పటికే పొంగిలేటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం అంటూ తెలియజేశారు.

ఇక కాంగ్రెస్ పార్టీ కూడా పొంగులేటి శ్రీనివాస్ ని ఆహ్వానిస్తూ రాయబారాలు పంపిస్తోంది. రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కాస్త తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.ఇక కొన్ని వారాల క్రితం వైఎస్ షర్మిల తో కూడా పొంగులేటి చర్చలు జరిపారు.ఆమె పార్టీ కి సహాయం గా నిలుస్తానంటూ పొంగులేటి ఆ సమయంలో హామీ ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి.

దాంతో ఇప్పుడు షర్మిల పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా లేక పోలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే పొంగులేటి ఆ ప్రచారానికి క్లారిటీ ఇచ్చారు.

షర్మిల పార్టీలో చేరేంత సాహసం చేయను అన్నాడు.ఆ పార్టీ కి రాష్ట్రంలో పెద్దగా ప్రాచుర్యం.

ప్రాముఖ్యత లేదు కనుక తాను షర్మిల పార్టీలో చేరనంటూ క్లారిటీ ఇచ్చాడు.అయితే బిజెపి లేదా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తుంది.ఒకటి రెండు వారాల్లో ఆయన ఏ పార్టీలో జాయిన్ కాబోతున్నాడనే విషయమై స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.ఖమ్మం రాజకీయాలను శాషించే సత్తా ఉన్న పొంగులేటి తమ పార్టీ లో ఉంటే బాగుంటుంది అన్ని పార్టీ లు కూడా భావిస్తున్నాయి.

మరి ఆయన నిర్ణయం ఏంటో మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube