రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ( Telangana Congress )భారీగా ఆశలు పెట్టుకుంది.వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అనే ధీమాతో గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి పార్టీ నాయకులంతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా ముందుకు వెళుతూ ఉండడం కాంగ్రెస్ కు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది .
ఇప్పటికే అసెంబ్లీకి పోటీ చేయబోయే ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేసింది .
ఆ దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ పూర్తిగా పరిశీలించి అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ముందుగా ఈ నెలాఖరులోగా తొలి జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.వచ్చేనెల రెండవ వారానికల్లా మొత్తం అభ్యర్థుల ప్రకటన పూర్తిచేసి క్షేత్రస్థాయిలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలోకి దూసుకు వెళ్లే విధంగా ప్లాన్ చేస్తోంది.
ఇక తొలి విడత జాబితాలో బలమైన, ముఖ్యమైన అభ్యర్థులతో ఏక అభిప్రాయం ఉన్న 35 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించుకుంది .తొలి జాబితాలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ,( Revanth Reddy ) సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ( Komatireddy Venkat Reddy )సీతక్క, పోదెం వీరయ్య, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, దామోదర రాజా నరసింహ, జీవన్ రెడ్డి, జి వినోద్, షబ్బీర్ అలీ, సంపత్ కుమార్, వంశీ చంద్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు , ఫిరోజ్ ఖాన్, ప్రేమ్ సాగర్ రావు, అంజన్ కుమార్ యాదవ్, పద్మావతి రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, విజయ రమణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వంశీకృష్ణ వంటి వారి పేర్లు ఫైనల్ చేసినట్లు సమాచారం.గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధు యాష్కీ గౌడ్( Madhu Goud Yaskhi ) ఇతర కార్యదర్శులు పాల్గొన్నారు.
119 నియోజకవర్గాల నుంచి దరఖాస్తు చేసిన 300 మంది పేర్ల పైన చర్చించారు.సర్వేల ఆధారంగా అభ్యర్థులు ఎంపికను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కానుగోలు తాము చేసిన సర్వేల నివేదికను అందజేసినట్లు సమాచారం.
ఇద్దరు , ముగ్గురు, అంతకన్నా ఎక్కువ మంది పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో ఎవరికి ఎంత శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయనే దానిపైన వివరాలు అందించగా దానిపై చర్చించి కమిటీ నేతలు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయబోతున్నారట.