రాజకీయాలు ప్రధానం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.పాలిటిక్స్ కంటే అభివృద్ధే ముఖ్యమని తెలిపారు.
ఏపీ రాష్ట్రం అవినీతి రాజకీయాలకు కేంద్రంగా మారిందని సోము వీర్రాజు విమర్శించారు.ఏపీలో ఇసుక, మైనింగ్, మద్యం అన్నింటిలో అవినీతే ఉందని ఆరోపణలు చేశారు.
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టెన్త్ వాళ్లతో ఓట్లు వేయించారని తెలిపారు.జగన్ ప్రభుత్వంపై ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉందని వెల్లడించారు.