ఈరోజు రఘువరన్ బ్రతికి ఉంటే అంటూ భర్తను తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేసిన నటి రోహిణి!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటీనటులుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రఘువరన్(Raghu Varan) నటి రోహిణి(Rohini) ఒకరు.దివంగత నటుడు రఘువరన్ పలు సినిమాలలో హీరోగా నటించడమే కాకుండా విలక్షణ నటుడిగా ఎంతో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు పొందారు.

 Today, If Raghuvaran Is Alive, Actress Rohini Made An Emotional Post Touching He-TeluguStop.com

ఇలా నటుడిగా ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రఘువరన్ మరొక నటి రోహిణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఈమె కూడా ఇండస్ట్రీలో నటిగా నటించడమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి సందడి చేశారు.

ఇలా వీరిద్దరూ ఇండస్ట్రీలో కొనసాగుతూ 1996లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఈ విధంగా ఈ జంట 1996లో పెళ్లి చేసుకుని ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు.ఇలా వీరి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ 2004వ సంవత్సరంలో విడాకులు తీసుకుని విడిపోయారు.ఇలా విడాకులతో విడిపోయినటువంటి వీరిద్దరూ వారి సినీ కెరియర్ లో బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఒంటరిగా గడుపుతున్నటువంటి రఘువరన్ 2008 మార్చి 19వ తేదీ మరణించారు.తాజాగా ఈయన వర్ధంతి సందర్భంగా నటి రోహిణి తన భర్తను తలుచుకొని తన భర్త కొడుకుతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే రోహిణి ఈ ఫోటోని షేర్ చేస్తూ ఈ రోజు కనుక రఘువరన్ బ్రతికే ఉంటే నేటి సినిమాలను కచ్చితంగా ఆయన ఇష్టపడి,ఒక నటుడిగా ఎంతో సంతోషించేవారు అంటూ ఈ సందర్భంగా ఈమె తన భర్తను తలచుకొని చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇక రోహిణి ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube