ప్రొద్దుటూరులో దారుణం.. ఇంట‌ర్ అమ్మాయిని ఘోరంగా.. ?

రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలు తెస్తున్నా అమ్మాయిలపై దాడులు ఆగడం లేదు.ఇలాంటి విషయాల్లో కేంద్రం కూడా సీరీయస్‌గానే ఉంది.

 Kadapa District, Police, Arrest, Beloved Sunil-TeluguStop.com

ఇక ఆడపిల్లలను వేధించే వారిని కఠినంగా శిక్షించినా అది చూసిన వారిలో ఏమాత్రం భయం కలగడం లేదు.కాగా క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో నిన్న ఓ యువ‌తిపై సునీల్ అనే ప్రేమోన్మాది దాడికి పాల్ప‌డ్డ విష‌యం తెలిసిందే.

ఈ దాడిలో తీవ్ర‌గాయాలపాలైన ఆ యువతి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది.కాగా ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉందని సమాచారం.

ఇక ఆ అమ్మాయి తల్లిదండ్రుల  ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సునీల్‌ను అదుపులోకి తీసుకున్నారట.ప్రొద్దుటూరు రైల్వే స్టేష‌న్ వ‌ద్ద ఈ నేరగాడు ఉన్న‌ట్లుగా గుర్తించిన పోలీసులు సునీల్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

ఇకపోతే ఇలాంటి దారుణాలకు పాల్పడే వారి కుటుంబంలోని ఆడపిల్లలకు కూడా ఇదే ఘటన ఎదురైతే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అని ఈ విషయం తెలిసిన నెటిజన్స్ అంటున్నారట.నిజమే కదండి ఎవరింటి పిల్ల అయినా ఒకటే కదా.ఇంతటి దారుణానికి పాల్పడే ముందు కిరాతకులకు వారి తల్లి చెళ్లల్లు గుర్తుకు రారు కావచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube