పవన్ కల్యాణ్ సరసన ఎంతో మంది హీరోయిన్లు నటించారు.వాటిలో పలు సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి.
పవన్ ఇప్పటికీ టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.అయితే ఆయనతో పాటు నటించిన కొందరు హీరోయిన్లు మాత్రం నెమ్మదిగా వెండి తెరకు దూరం అయ్యారు.
కొంత కాలం తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.తొలుత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసినా గంతలో మాదిరిగా అంత పేరు రాలేదనే చెప్పాలి.
వారు తల్లి పాత్రలు చేసి మంచి నటన కనబర్చినా పెద్ద అవకాశాలు మాత్రం రావడం లేదు.ఇంతకీ పవన్ తో నటించి ప్రస్తుతం తల్లిపాత్రల్లో సెటిల్ అయిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
రాశి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి సూపర్ హిట్ మూవీ గోకులంలో సీతలో నటించింది అందాల తార రాశి.ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1997లో విడుదల అయ్యింది.
జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు ఓ అమ్మాయి ప్రేమ కోసం పడే తపననే ఈ సినిమాలో తెరకెక్కించారు.పవన్ నటన చూసి జనాలు కంటతడి పెట్టుకున్నారు.
ఈ సినిమా తర్వాత రాశి పలు సినిమాలు చేసింది.బిజీ బిజీగా గడిపిన రాశి ఆ తర్వాత నెమ్మదిగా ఫేడవుట్ అయ్యింది.
కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపై రీ ఎంట్రీ ఇచ్చింది.
కళ్యాణ వైభోగమే, లంక లాంటి సినిమాలు చేసింది.పలు సినిమాల్లో తల్లిపాత్ర పోషించింది.

అయినా ఆమె సెకెండ్ ఇన్నింగ్స్ అంత సక్సె స్పీడ్ అందుకోలేదు.తాజాగా ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది.అందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో మాస్క్ కట్టుకుని ఉంది.షూటింగ్ జరిగే బిల్డింగ్ లోకి వెళ్లి అక్కడ ఏర్పాట్లను పరిశీలించింది.కరోనా కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలిస్తుంది.ఇది సినిమానా? లేక వెబ్ సిరీసా? అనేది తెలియాల్సి ఉంది.గతంతో పోల్చితే ఇందులో రాశి సన్నబడి నాజూగ్గా కనిపిస్తుంది.
దేవయాని
భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా 1998లో వచ్చిన సూపర్ హిట్ మూవీ సుస్వాగతం.సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి.చౌదరి నిర్మాణంలో ఈ సినిమా వచ్చింది.తెలుగు సినిమా పరిశ్రమలో ఇదో సూపర్ హిట్ మూవీగా నిలిచింది.

ఈ మూవీలో పవన్ సరసన దేవయాని హీరోయిన్‌గా చేసింది.తెలుగులో దేవయానికి ఇదే తొలి సినిమా కావడం విశేషం.అయినా తన అద్భుత నటనతో తెలుగు జనాలను ఆకట్టుకుంది.అనంతరం శ్రీమతీ వెళ్ళొస్తా, చెన్నకేశవరెడ్డి, మాణిక్యం, నాని మూవీల్లో నటించింది.అయితే ఈ సినిమాలు ఈమెకు అంతగా గుర్తింపు ఇవ్వలేదు.కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ నుంచి వైదొలిగింది.
అనంతరం పలు భాషల్లో కొన్ని సినిమాలు చేసింది.చివరకు తమిళ దర్శకుడు రాజకుమారన్ ను ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం క్యారెక్టర్ అర్జిస్ట్ గా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.ఇటీవల ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రంలో మెహన్ లాల్ కు భార్యగా కనిపించింది.