PM Modi Telangana Tour : ప్రధాని మోది తెలంగాణ టూర్ .. షెడ్యూల్ ఈ విధంగా

రాబోయే లోక్ సభ ఎన్నికలను( Loksabha Elections ) దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో బిజెపి( Telangana BJP ) ప్రభావాన్ని పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోది( PM Narendra Modi ) రేపటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.  ఈ మేరకు తెలంగాణలో శుక్ర,  శని , సోమవారాల్లో వివిధ చోట్ల జరిగే బహిరంగ సభలో రోడ్డు షోలలో ప్రధాని ఈ మేరకు శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ కు చేరుకుని రాత్రికి రాజ్ భవన్ లో ప్రధాని బస చేయనున్నారు.

 Pm Narendra Modi Telangana Tour Schedule Details-TeluguStop.com

  శనివారం ఉదయం నాగర్ కర్నూల్ లో( Nagar Kurnool ) జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.  18న జగిత్యాల లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతారు.

  శుక్ర,  శనివారాల్లో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో,  ప్రధాని పర్యటనపై అందరికీ ఆసక్తి నెలకొంది.ప్రధాని నరేంద్ర మోది పర్యటన నేపథ్యంలో,  భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Telugu Congress, Loksabha, Moditelangana, Modi, Nagar Kurnool, Telangana Bjp, Te

శుక్రవారం సాయంత్రం 4.40 నుంచి 7 గంటల మధ్య బేగంపేట పిఎన్టి జంక్షన్,  రసూల్ పుర,  సిటిఓ ప్లాజా , సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్,  ఆలుగడ్డ బావి , మెట్టుగూడ రైల్వే హాస్పిటల్,  మెట్టుగూడ రోటరీ,  మీర్జాలగూడ టీ జంక్షన్,  మల్కాజిగిరి ఆర్చి, లాలాపేట్ , తార్నాక గ్రీన్ ల్యాండ్స్ మోనప్ప జంక్షన్, రాజ్ భవన్ , ఎంఎంటీఎస్ జంక్షన్ వివి విగ్రహం మార్గంలో ట్రాఫిక్ ఆంక్షల విధించారు.

ప్రధాని షెడ్యూల్ ఈ విధంగా…

Telugu Congress, Loksabha, Moditelangana, Modi, Nagar Kurnool, Telangana Bjp, Te

శుక్రవారం సాయంత్రం 4.50 గంటలకు కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు ప్రధాని మోది వస్తారు.సాయంత్రం 5.15 గంటల నుంచి 6.15 గంటల వరకు మల్కాజ్ గిరి లో రోడ్డు షో నిర్వహిస్తారు.రోడ్డు మార్గాన 6.40 గంటలకు రాజ్ భవన్ కు చేరుకుంటారు.  రాత్రికి అక్కడే బస చేస్తారు .శనివారం ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరి 1150 గంటలకు నాగర్ కర్నూల్ చేరుకుంటారు .మధ్యాహ్నం 12 నుంచి 12.45 గంటల దాకా అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.  ఒంటిగంటకు నాగర్ కర్నూల్ నుంచి హెలికాఫ్టర్ లో మధ్యాహ్నం 2.05 గంటలకు కర్ణాటకలోని గుల్బర్గాకు బయలుదేరి వెళ్తారు.  తిరిగి 18న తెలంగాణకు వస్తారు.

ఆ రోజు షెడ్యూల్ ఇంకా విడుదల కావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube