తెలుగులో ఛానల్ తో సంబంధం లేకుండా ఇటు ఈ టీవీ ఛానల్, జెమిని టీవీ ఛానల్, జీ తెలుగు ఛానల్ ఇలా అన్ని చానల్లలో పలు రకాల విభిన్న షోలు చేస్తూ యాంకర్ అనసూయ బిజీబిజీగా గడుపుతోంది.తాజాగా ఈ అమ్మడు డు ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించినటువంటి ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొంది.
ఇందులో భాగంగా తన అందాలను ఒలకబోస్తూ మత్తెక్కించే చూపూలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
అయితే ఈ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.
ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కొద్ది సమయంలోనే దాదాపుగా 75000 పైచిలుకు వ్యూస్ వచ్చాయి.అంతేగాక అనసూయ అందానికి ఫిదా అయినటువంటి అభిమానులు తన అందం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇప్పటికే తన నటనా పరంగా పలువురు సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు పొందిన అనసూయని తెలుగులో హీరోయిన్ గా ఎప్పుడు చేస్తున్నావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
అయితే ఇది ఇలా ఉండగా ఇప్పటికే అనసూయ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది.ఈ చిత్రంలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడు.అంతేగాక స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న టువంటి మరో చిత్రంలో కూడా అనసూయ నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.