నటి భూమిక (Bhumika) అంటే తెలియని వారు ఉండరు.ఈమె అప్పట్లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతుంది.ఇక ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎక్స్పోజింగ్లకు చాలా వరకు దూరం గా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాత్రం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చి బిజీ అవ్వాలని చూస్తోంది.
ఇక ఈమె అప్పట్లో బ్లాక్ బస్టర్ సినిమాలైనా ఒక్కడు, సింహాద్రి(Simhadri), ఖుషి(Kushi) వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.అయితే అలాంటి భూమిక సెలబ్రిటీ యోగా టీచర్ అయిన భరత్ ఠాకూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఓ వ్యక్తి భూమిక కి పెళ్ళై భర్త ఉండగానే లవ్ లెటర్ రాసి నేరుగా ఆమె భర్తకి పంపించాడట.మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

హీరోయిన్ భూమిక కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్,భోజ్ పూరి,పంజాబీ వంటి భాషల్లో కూడా చేసింది.ఈమె మొదట సుమంత్ హీరోగా వచ్చిన యువకుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది.ఆ తర్వాత ఆమె ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో చేసి హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక కూడా ఎంసీఏ,లడ్డు బాబు, యూటర్న్,సీతారామం (Sitaramam) వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది.అయితే ఈ మధ్యకాలంలో భూమిక చాలా అందంగా చీర కట్టుకొని రెడీ అయి తన సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలు షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ ఫోటోలు చూసి ఫీదా అయిన ఒక నెటిజన్ భూమిక కి చాలా అద్భుతంగా లవ్ లెటర్( Love Letter ) రాసి ఆ లెటర్ ఆమెకి కాకుండా ఆమె భర్తకి షేర్ చేసి మీ భార్యకి ఈ లవ్ లెటర్ వినిపించండి అంటూ చెప్పారట.అయితే ఇదే విషయాన్ని భూమిక (Bhumika) తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఒక అభిమాని నాకు లెటర్ రాసి మా భర్తకి ఇచ్చి మీ భార్యకు వినిపించండి అని చెప్పారు.ఆ వ్యక్తి రాసిన ప్రేమలేఖ నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది అంటూ పోస్ట్ పెట్టింది.ప్రస్తుతం భూమికకి సంబంధించిన ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.