బీఆర్ఎస్ పాలనలో ప్రజల లక్ష్యాలు నెరవేరలేదు..: ప్రియాంక గాంధీ

తెలంగాణలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆమె పాలకుర్తిలో కాంగ్రెస్ బహిరంగ సభకు హాజరై ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

 People's Goals Were Not Fulfilled Under Brs Regime..: Priyanka Gandhi-TeluguStop.com

తెలంగాణలో రైతుల భూములను బీఆర్ఎస్ లాక్కుంటోందని ప్రియాంక గాంధీ ఆరోపించారు.త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందన్న ఆమె బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల లక్ష్యాలు నెరవేరలేదని చెప్పారు.

పరీక్ష పేపర్ లీకుల వలన ఎంతోమంది బలవన్మరణానికి పాల్పడ్డారన్నారు.ఈ క్రమంలో తెలంగాణ యువతపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉందని ప్రియాంక తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ తీసుకొస్తామని పేర్కొన్నారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.500 కే గ్యాస్ తో రైతులకు మద్ధతు ధర కల్పిస్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube